హైదరాబాద్

రెజిమెంటల్ బజార్‌లో భారీ చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: సికిందరాబాద్‌లోని రెజిమెంట్ బజార్‌లో భారీ చోరీ జరిగింది. పట్టపగలు ఇంటితాళాలు పగులగొట్టి బంగారు నగలు దోచుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం.. సికిందరాబాద్ బండిమెట్‌లో నివాసముంటున్న దయానంద్‌కు ఇద్దరు కుమార్తెలు. గతంలో పాఠశాల ప్రిన్సిపల్‌గా పనిచేసిన ఆయన ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం తన కుటుంబ సభ్యులతో కలసి బంధువుల ఇంట్లో ఓ శుభకార్యానికి వెళ్లి..సాయంత్రం వచ్చాడు. ఇంటికి చేరుకున్న అతడికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడం చూసి ఖంగుతిన్నాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా పడక గదిలో ఉన్న బీరువాలోని 60 తులాల బంగారు నగలు, రూ. 6వేలు నగదు కనిపించలేదు. కుమార్తెల వివాహాల కోసం సమకూర్చుకున్న బంగారం చోరీకి గురికావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమీపంలోని సిసి కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఒక్కడే ఈ చోరీకి పాల్పడిన బ్యాగుతో ఉడాయిస్తున్నట్టు గుర్తించినట్టు ఇన్‌స్పెక్టర్ మట్టయ్య తెలిపారు. నింతితుడిని త్వరలో పట్టుకుంటామని ఆయన చెప్పారు.
వివాహేతర సంబంధం
పెట్టుకున్న ఎస్‌ఐ అరెస్టు

హైదరాబాద్, ఫిబ్రవరి 20: ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న సబ్-ఇన్స్‌పెక్టర్‌ను ఎస్‌ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐపై సెక్షన్ 497, 448 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్టు ఇన్‌స్పెక్టర్ వహీదుద్దీన్ తెలిపారు. ఖమ్మం-2టౌన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న విజయ్‌కి ఓ మహిళ ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైంది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. మోదీనగర్ కామధేను అపార్ట్‌మెంట్‌లో వారిద్దరూ గత ఎనిమిది నెలలుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా ఎస్‌ఆర్ నగర్ పోలీసులు విజయ్‌ని అరెస్టు చేశారు. ఎస్‌ఐ విజయ్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఆ మహిళ భర్తే అక్కడి వాచ్‌మెన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించినట్టు తెలిసింది. తొమ్మిదేళ్ల క్రితం వివాహమైన మహిళ, ఎనిమిది నెలలుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్‌ఐపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.