హైదరాబాద్

శాసన మండలి టీచర్స్ స్థానానికి 33 నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్(అవిభక్త)జిల్లాలను కలుపుతూ ఏర్పాటు చేసిన శాసన మండలి ఉపాధ్యాయుల నియోజకవర్గం ఎన్నికకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సోమవారం ముగిసింది. ఈ నెల 13వ తేదీన నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి రిటర్నింగ్ అధికారి, జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్ అద్వైతకుమార్ సింగ్ అభ్యర్థుల నుంచి 33 నామినేషన్లను స్వీకరించారు. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఇ.లక్ష్మయ్య, నర్ర భూపతిరెడ్డి, మహ్మద్ మోయినుద్దిన్ అహ్మద్, ఎస్. విజయ్‌కుమార్, ఎ. వెంకటనారాయణరెడ్డి, పాపన్నగారి మాణిక్‌రెడ్డి, కాటేపల్లి జనార్దన్ రెడ్డి, టి. హర్షవర్థన్ రెడ్డి, ఏ. లక్ష్మయ్య, ఎం.వి. నర్సింగ్‌రావు, మీసాల గోపాల్ సాయిబాబా, అరకల కృష్ణగౌడ్, డా.వి.నథానియేల్, జ్ఞానేశ్వరమ్మ, ఎం. మమత, ఎ. వెంకటనారాయణరెడ్డి, కోయల్‌కార్ భోజరాజు, సంతోష్‌యాదవ్‌లు ఉన్నారు. వీరిలో కొందరు రెండు నుంచి మూడు సెట్ల నామినేషన్లను సమర్పించారు. ఈ నామినేషన్లను మంగళవారం జిహెచ్‌ఎంసి అధికారులు స్క్రూటినీ చేయనున్నారు. నిబంధనల ప్రకారం పూరించని వాటిని తిరస్కరించి, వాటి వివరాలను ప్రకటించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 23వరకు గడువునిచ్చి, ఆ తర్వాత వచ్చే నెల 9వ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు జిహెచ్‌ఎంసి ఏర్పాట్లు చేస్తోంది.
పోలింగ్‌కు మూడు జిల్లాల్లో ఏర్పాట్లు
శాసన మండలి ఉపాధ్యాయుల నియోజవర్గం పరిధిలో పోలింగ్ నిర్వహించేందుకు జిహెచ్‌ఎంసి మూడు జిల్లాల్లో ఏర్పాట్లు చేస్తోంది. టీచర్స్ ఓటర్లు మొత్తం 23వేల 13 మంది ఉండగా, మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 6675 మంది ఓటర్లు, అలాగే రంగారెడ్డి జిల్లాలో 11వేల 832 మంది, హైదరాబాద్‌లో 4501 ఓటర్లున్నారు. మూడు జిల్లాల్లో కలిపి 126 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌లో 22, మహబూబ్‌నగర్‌లో 57, రంగారెడ్డి జిల్లాలో 47 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వౌలిక సౌకర్యాలను కల్పించేలా జిహెచ్‌ఎంసి ఆదేశించింది. అంతేగాక, పోలింగ్ శాంతియుతంగా జరిగేందుకు వీలుగా కమిషనర్ జనార్దన్ రెడ్డి, రిటర్నింగ్ అధికారి అద్వైతకుమార్ సింగ్‌లు ఇప్పటికే పలు దఫాలుగా పోలీసు అధికారులతో సమావేశమై బందోబస్తు వ్యూహాన్ని రచిస్తున్నారు.
పనులు వేగవంతం చేయాలి

శివారు మంచినీటి ప్రాజెక్టు పనులపై ఎండి సమీక్ష

హైదరాబాద్, ఫిబ్రవరి 20: శివార్ల దాహార్తీని తీర్చేందుకు రూ. 1900 కోట్ల హడ్కో నిధులతో చేపట్టిన మంచినీటి ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన జలమండలి ప్రధాన కార్యాలయంలో ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాడ్కో నిధులతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే శివార్ల దాహార్తీ తీరుతుందని, ప్రాజెక్టు పనులను ముందుగా నిర్ణయించిన గడువులోపే పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం, జలమండలి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు పనుల పురోగతిని రోజువారీగా సమీక్షిస్తూ పనులను వేగవంతం చేయాలని జనరల్ మేనేజర్లను ఆదేశించారు. ముఖ్యంగా పనులు మరింత వేగవంతంగా జరగటంతో పాటు పనుల్లో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా తగిన ప్రమాద నివారణ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని పనుల నిర్వాహణ సంస్థలను ఆదేశించారు.పనులు జరిగే ప్రాంతాల్లో బ్యారికేడ్లు, సూచిక బోర్డులను క్షేత్ర స్థాయిలో ప్రాజెక్టు పనులు జరిగే ప్రదేశాల్లో బాధ్యతగా ఏర్పాటు చేయాలన్నారు. రోడ్లను తవ్వటం, తవ్విన రోడ్లకు మరమ్మత్తులు చేయటం ఏక కాలంలో చేపట్టాలని అధికారులకు ఎండి సూచించారు. ఈ సమీక్షలో జలమండలి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎం. సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్ ఎం. ఎల్లస్వామి, రెవెన్యూ డైరెక్టర్ డి. శ్రీ్ధర్‌బాబు, ప్రాజెక్టు విభాగం సిజిఎంలు, జిఎంలు పాల్గొన్నారు.