హైదరాబాద్

శాసన మండలి స్థానిక సంస్థల స్థానం ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: శాసన మండలి జిహెచ్‌ఎంసి స్థానిక సంస్థ స్థానం ఎన్నికకు సంబంధించి మంగళవారం నుంచి నామినేషన్లను స్వీకరించనున్నట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ స్థానిక సంస్థ కోటా కింద శాసన మండలిలో ఇద్దరికి స్థానం కల్పిస్తారు. ఇందులో ఎం.ఎస్. ప్రభాకర్, సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరిలో జాఫ్రీ పదవీ కాలం వచ్చే మే 1వ తేదీతో ముగియనుండటంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రక్రియను చేపట్టింది. ఇందుకు సంబంధించి మంగళవారం అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా నోటిఫికేషన్ వచ్చే ఈ నెల 21వ తేదీ నుంచి వచ్చే నెల 24వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. నేటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించి, మార్చి 1వ తేదీన నామినేషన్ల పరిశీలనను చేపట్టనున్నట్లు కమిషనర్ తెలిపారు. మార్చి 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశమిచ్చి, మార్చి 17వ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్‌ను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 20వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వచ్చే నెల 24వ తేదీ వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే శాసన మండలి టీచర్స్ స్థానం ఎన్నికకు కూడా రిటర్నింగ్ అధికారిగా అదనపుకమిషనర్ అద్వైతకుమార్ సింగ్ వ్యవహారించనున్నట్లు కమిషనర్ తెలిపారు.
ఓటర్లు వీరే
హైదరాబాద్ స్థానిక సంస్థల మండలి స్థానానికి పోటీ చేసే అభ్యర్థులను హైదరాబాద్ జిల్లా పరిధికి చెందిన ఎమ్మెల్సీలు, ఎంపిలు, ఎమ్మెల్యేలతో పాటు జిల్లా పరిధిలోని వంద డివిజన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న వంద మంది కార్పొరేటర్లు ఈ పోలింగ్‌లో తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. వంది కార్పొరేటర్లు కాగా, మరో 49 మంది ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి మొత్తం 149 మంది ప్రజాప్రతినిధులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇక ఆన్‌లైన్ అసెస్‌మెంట్
క్షేత్ర స్థాయి సిబ్బంది అక్రమాలకు చెక్
ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చిన
సెల్ఫ్ అసెస్‌మెంట్

హైదరాబాద్, ఫిబ్రవరి 20: మహానగర పాలక సంస్థ ఆస్తిపన్ను వసూళ్లు, అసెస్‌మెంట్‌లో మరింత పారదర్శకత కోసం ఆన్‌లైన్‌లో స్వీయ ఆస్తిపన్ను నిర్థారణ చేసేందుకు జిహెచ్‌ఎంసి సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. హైదరాబాద్ నగరంలో కొత్తగా ఇళ్లను నిర్మించుకున్న యజమానులు తమ నూతన గృహాల ఆస్తిపన్నును చెల్లించేందుకు సిద్దంగా ఉన్నా, నిర్థారించే క్షేత్ర స్థాయి సిబ్బంది, అధికారుల ప్రమేయం లేకుండానే యజమాని ఆన్‌లైన్‌లో స్వీయ నిర్థారణ చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది. కొందరు ట్యాక్సు సిబ్బంది అసెస్‌మెంట్లు చేయటంలో, ఆస్తిపన్నును వర్తింపజేయటంలో అక్రమాలకు, అవతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇంటి యజమాని స్వయంగా ఆన్‌లైన్‌లో తన ఆస్తికి సంబంధించి పన్నును నిర్థారించుకునేందుకు వీలుగా ఈ విధానం అందుబాటులోకి రానుంది. మరికొన్ని సందర్భాల్లో ట్యాక్సు అధికారులు ఆస్తిపన్ను నిర్థారణను అధిక మొత్తంలో చూపించటం వంటి లోపాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి ఆరోపణలకు, అక్రమాలకు తావులేకుండా యజమానులే నేరుగా తన ఆస్తికి సంబంధించి ఏరియాను, యుసేజీని బట్టి పన్నును ఆన్‌లైన్‌లో నిర్దారించుకుని చెల్లించేందుకే ఈ సరికొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు.
వివరాలను నమోదు చేయాల్సిన తీరు
* రిరిరి.ఖిఖీజిట.ఖితిబీ.గిజీ అనే వెబ్‌సైట్‌కు వెళ్లి అందులో ఈ- రిజిస్ట్రేషన్స్ ప్రాపర్టీ ట్యాక్సు సెల్ఫ్ అసెస్‌మెంట్‌ను క్లిక్ చేయాలి
* ఈ రిజిస్ట్రేషన్ ద్వారా తమ మొబైల్ నెంబర్‌ను నమోదు చేసుకోవాలి. దీంతో మీ రిజస్టురు చేసుకున్న మొబైల్ నెంబర్‌కు వోటిపి(వన్ టైం పాస్‌వార్డు)వస్తుంది.
* వచ్చిన వన్ టైం పాస్‌వార్డును టైప్ చేయటంతో దరఖాస్తు ఫారం స్క్రీన్‌పై వస్తుంది. అందులో ఇంటి యజమాని పేరు, ఆస్తి వివరాలను నమోదు చేయాలి. భవన నిర్మాణ అనుమతుల వివరాలు, ఏవైనా డీవియేషన్లు ఉన్నా, వాటి సమాచారాన్ని సమగ్రంగా నమోదు చేయాలి.
* ఇల్లు/ నిర్మాణం కొనసాగుతున్న జోన్, సబ్‌జోన్‌లలో ఉన్న యూనిట్ ధరలతో కూడిన వివరాలతో పాటి చెల్లించాల్సిన సుమారు ఆస్తిపన్ను వివరాలు స్క్రీన్‌పై వస్తాయి.
* ఇంటి యజమానికి మొత్తం సమాచారం నమోదు చేసిన తర్వాత ఈ దరఖాస్తు సంబంధిత సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు వెళ్తుంది.
* డిప్యూటీ కమిషనర్ ఈ దరఖాస్తును సంబంధిత డిప్యూటీ కమిషనర్ సంబంధిత అధికారి ద్వారా ఇంటి యజమానికి వద్దకు పంపి, ఇంటి సంబంధిత డాక్యుమెంటేషన్ పరిశీలించి నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన ఆస్తిపన్నును నిర్థారిస్తారు.
* ఆన్‌లైన్ ద్వారా ఆస్తిపన్ను స్వీయ నిర్థారణ చేపట్టడం ద్వారా పన్ను ముదింపులో అక్రమాలు, అవకతవకలను నివారించటంతో పాటు ఏ భవనానికి ఎంత పన్ను చెల్లించాలన్న విషయంలో ఆయా ఇంటి యజమానులకు స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా ప్రవేశపెట్టిన ఈ ఆన్‌లైన్‌లో ఆస్తిపన్ను స్వీయ నిర్దారణ విధానం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని అధికారులు భావిస్తున్నారు.