హైదరాబాద్

ఎవరూ ఆక్షేపించలేని ‘శైవసిద్ధాంతదర్శిని’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లకుంట, ఫిబ్రవరి 27: వేదాలు, పురాణాలు, ఆగమాల ప్రమాణాలలో నుంచి ఎవ్వరూ ఆక్షేపించలేని రీతిలో డా. ముదిగొండ భవానీ ‘శైవసిద్ధాంతదర్శిని’ గ్రంథ రచన గావించారని ఆంధ్రభూమి సంపాదకులు ఎం.వి.ఆర్ శాస్ర్తీ అభినందించారు. ముదిగొండ వీరేశలింగశాస్ర్తీ మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ‘శైవ సిద్ధాంత దర్శిని’ గ్రంథావిష్కరణ కార్యక్రమం సోమవారం నల్లకుంటలోని శృంగేరి శంకరమఠములో జరిగింది. జ్యోతిప్రజ్వలన చేసి సభను ప్రారంభించినానంతరం ఆయన మాట్లాడుతూ హిందువులు తమ మతం గురించి అధ్యయనం చేయకుండా ఇతర మతాల్లోని ఔన్నత్యం గురించి మాట్లాడుతుంటారని, పరమత సహనం ఎంత అవసరమో పరమత సహిష్ణుత తమ మతం పట్ల అభిమానం అవసరమని అన్నారు. ప్రపంచంలోనే అతి పురాతనమైనది శైవమని, వాటికి ఎన్నో చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. శైవ ధర్మం అతి ప్రాచీనమైందని అనేందుకు ఆలయాలు, దేవతామూర్తులు అనేక చోట్ల బయటపడటం ద్వారా తెలుస్తోందని ఎంవిఆర్ శాస్ర్తీ వివరించారు. శ్రీ శైవ మహాపీఠం అధిపతి అత్తలూరి మృత్యుంజయ శర్మ అనుగ్రహభాషణం చేస్తూ భారతీయ సంప్రదాయం ప్రకారం ప్రతి జీవిలో పరమాత్ముడు ఉన్నాడని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఋషిపీఠం వ్యవస్ధాపకులు సామవేదం షణ్ముఖ శర్మ మాట్లాడుతూ సిద్ధాంతాలు మానవులను తరింపచేయడానికి ఉన్నాయే తప్ప వాదనలకు కావని, సిద్ధాంతాలను అనుష్ఠించి మహానుభావులు చెప్పిన విషయాలను అనుసరించి తరించాలని అన్నారు. చారిత్రక నవలాచక్రవర్తి ముదిగొండ శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాల(వరంగల్) ప్రిన్సిపల్ డా.ఇవటూరి రామకృష్ణ చిత్రపటాన్ని ఆవిష్కరించారు.
శ్రీ శైవమహాపీఠ పండిత మండలి సభ్యులు ముత్యంపేట గౌరీశంకర్ గ్రంథపరిచయం చేయగా, ఆంధ్రోపన్యాసకులు, శ్రీ శైవమహాపీఠ పండిత మండలి సభ్యులు ముదిగొండ అమరనాథ శర్మ గ్రంథాన్ని సమీక్షించనున్నట్లు వెల్లడించారు. ఆవిష్కరించిన గ్రంథంపై ముదిగొండ భవాని స్పందన తెలియజేశారు. సామవేదం షణ్ముఖ శర్మను ‘శివతత్వ సుధానిధి’ అనే బిరుదుతో సత్కరించారు. ప్రముఖ వ్యాఖ్యాత మడిపల్లి దక్షిణమూర్తి కూడా పాల్గొన్న ఈ సభకు ముందు మంగళకుమారి బృందం ఆలపించిన భక్తిసంగీతం సభికులను భక్తి విశేషంగా ఆకట్టుకుంది.

ఫలిస్తున్న ప్రయత్నాలు
నిధుల సమీకరణకు ఫలిస్తున్న గ్రేటర్ చర్యలు
ట్రేడ్ లైసెన్సుల వసూళ్లలో పురోగతి

హైదరాబాద్, ఫిబ్రవరి 27: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జిహెచ్‌ఎంసిని గట్టెక్కించేందుకు అధికారులు చేస్తున్న చేస్తున్న పలు ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. జిహెచ్‌ఎంసి ప్రధాన ఆర్థిక వనరులైన ఆస్తిపన్ను వసూళ్లు, భవన నిర్మాణ అనుమతుల ఛార్జీలు, ట్రేడ్ లైసెన్సుల ఫీజులు వంటివి ముఖ్యమైనవి. వీటిలో ఇప్పటికే ఈ ఏటా ఆస్తిపన్ను వసూళ్లను రూ. 1500 కోట్లకు లక్ష్యంగా పెట్టుకోగా, అందులో కేవలం రూ. 900 కోట్ల వరకు వసూలైంది. దీనికి తోడు టౌన్‌ప్లానింగ్‌కు సంబంధించి నిర్మాణ అనుమతులకు సంబంధించి వచ్చే దరఖాస్తుల సంఖ్య కూడా ఏ మాత్రం తగ్గలేదు. ఈ సారి కూడా టౌన్‌ప్లానింగ్ విభాగం నుంచి ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు సుమారు రూ. 500 కోట్ల వరకు ఆదాయం సమకూర్చుకునేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా గడిచిన ఆరు, ఏడు ఆర్థిక సంతవ్సరాల నుంచి ప్రతి ఏటా ట్రేడ్ లైసెన్సుల ఫీజులను అధికారులు ఎక్కువ మొత్తంలో వసూలు చేసుకుంటూ వస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం 2015-16లో అధికారులు మొత్తం 42వేల 836 ట్రేడ్‌లకు గాను రూ. 28.51 కోట్ల ఫీజులను వసూలు చేయగా, వర్తమాన ఆర్థిక సంవత్సరం 2016-17 ముగిసేందుకు మరో నెలరోజులు గడువు ఉండగానే నేటి వరకు 70వేల 597 మంది వ్యాపారులను ట్రేడ్ లైసెన్సుల జాబితాలోకి తీసుకురావటంతో జిహెచ్‌ఎంసి రూ. 39 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. అంతర్గతంగా తలెత్తిన లోపాటలను సరిదుద్దకోవటం, ఫీజులను చెల్లించుకుండా ఎగవేతకు పాల్పడే వారిని గుర్తించి వారిని కూడా ఫీజులు చెల్లించే జాబితాలోకి తీసుకురావటం, క్షేత్ర స్థాయిలో డిప్యూటీ కమిషనర్ నుంచి మెడికల్ ఆఫీసర్లు, లైసెన్సు ఆఫీసర్, ఏఎల్‌వోలు, వెటర్నరీ అధికారులందర్ని ఈ ట్రేడ్‌లైసెన్సు ఫీజుల వసూళ్లలో భాగస్వాములన చేయటం వల్లనే ఈసారి వసూళ్లు గణనీయంగా పెరిగాయని అధికారులు చెబుతున్నారు. వర్తమాన ఆర్థిక సంవత్సరం ట్రేడ్ లైసెన్సుల ద్వారా రూ. 50 కోట్లు వసూలు చేయాలని జిహెచ్‌ఎంసి లక్ష్యంగా పెట్టుకోగా, ప్రస్తుతం వస్తున్న ఆదాయాన్ని గమనిస్తే ఈ సంవత్సరం ముగిసేపు లోపు అదనంగా మరో రూ. పది కోట్ల వరకు వసూలయ్యే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడిచారు.
ఫలించిన క్రాస్ వైరిఫికేషన్
మహానగరంలో రోజురోజుకి పట్టణీకరణ వేగంగా జరుగుతున్నా, గల్లీగల్లీల్లో వ్యాపార సంస్థలు వెలుస్తున్నా, ట్రేడ్ లైసెన్సులు పెరగటం లేదు. ఈ విషయంపై సీరియస్‌గా ఆలోచించిన జిహెచ్‌ఎంసి అధికారులు వాణిజ్య పన్నుల శాఖ ద్వారా ట్రేడ్ లైసెన్సులను లక్షా పదివేల మంది తీసుకున్నారు. నగరంలో కమర్షియల్ విద్యుత్ కనెక్షన్ల వివరాలు, అలాగే కమర్షియల్ ట్యాక్సు చెల్లించే వ్యాపార సంస్థల వివరాలను సేకరించిన జిహెచ్‌ఎంసి అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించగా, అనేక వాస్తవాలు బయటపడ్డాయి. కమర్షియల్ వాటర్, కరెంటు కనెక్షన్లు కల్గి కొనసాగుతున్న వ్యాపార సంస్థలను గుర్తించి, వాటిని ట్రేడ్ లైసెన్సు పరిధిలోకి తీసుకువచ్చి కలెక్షన్ పెంచుకుంటున్నారు. ఈ రకంగా సుమారు 27వేల మంది వ్యాపారులు ట్రేడ్ లైసెన్సు పరిధిలోకి లేకుండా వ్యాపారాలు కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. వీటిలో కొన్ని సంస్థళు ఇప్పటికే వేయగా, మిగిలిన వారికి ట్రేడ్ లైసెన్సులు పొందాలని ఎస్‌ఎంఎస్‌లు పంపడటం, అక్రమ వ్యాపారాలను నిర్వహించే వారికి నోటీసులు జారీ చేయటం, అధికారులు నిరంతర తనిఖీలు వంటి చర్యల ఫలితంగానే ఈ ఏటా ఇప్పటి వరకు రూ. 39 కోట్ల వరకు ట్రేడ్ లైసెన్సు ఫీజులు వసూలయ్యాయని అధికారులు తెలిపారు.