హైదరాబాద్

హైదరాబాద్‌లో త్వరలో 3వేల కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 1: ఇటీవల పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన పోలీస్ కానిస్టేబుళ్లు ఉత్తీర్ణత సాధించడం సంతోషంగా ఉందని నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర స్కిల్స్ డెవలప్‌మెంట్ సహకారంతో శిక్షణ పొందిన 251 మంది కానిస్టేబుళ్ల ఎంపిక పూర్తయిందని, త్వరలో నగరంలో మరో మూడువేల కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ కానుందని కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం పాతబస్తీలోని మంగళ్‌హాట్‌లో పోలీస్ ప్రీ రిక్రూట్‌మెంట్ సక్సెస్ మీట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ధూల్‌పేట్‌లో శాంతి నెలకొల్లాని సంకల్పించామని, గుడుంబా రహిత ప్రాంతంగా తీర్చిదిద్దామన్నారు. నగరంలో శాంతిభద్రతలు కాపాడుతున్నామన్నారు. నిరుపేద కుటుంబం నుంచి ఎంపికైన కానిస్టేబుళ్ల కళ్లల్లో ఆనందాన్ని చూస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. పోలీస్ వ్యవస్థ అంటే ప్రజలకు ఆప్తులు, నిజాయితీగా సేవా దృక్పథంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు. నా కేరీర్‌లోనే ఇలాంటి పెద్ద సక్సెస్‌ను ఎన్నడూ చూడలేదన్నారు. మంగళ్‌హాట్ గుడుంబా రహితంగా మారిందని, భవిష్యత్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవని, అందుకు కృషి సల్పుతున్న మంగళ్‌హాట్ పోలీసులను సిపి అభినందించారు. రానున్న కాలంలో ఇలాంటి స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమం నిర్వహిస్తామని, ఇప్పుడు సక్సెస్ కాలేదని బాదపడకుండా వచ్చే రిక్రూట్‌మెంట్ ప్రిపేర్ కావాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ స్కిల్స్ డెవలప్‌మెంట్ చీఫ్ నీతూ కుమారి, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.