హైదరాబాద్

మహిళా రాజకీయాలకు ఆద్యురాలు ‘నాగమ్మ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సత్కళాభారతి ఆధ్వర్యంలో జరుగుతున్న కెవి రమణాచారి 64 జన్మదినోత్సవ నాటకోత్సవాలలో భాగంగా రెండవరోజు ఆదివారం సాయంత్రం రవీంద్రభారతిలో ‘నాయకురాలు నాగమ్మ’ నాటకాన్ని ప్రదర్శించారు. డా. కోట్ల హనుమంతరావు దర్శకత్వంలో జి.సత్యనారాయణ నిర్వహణలో ప్రదర్శించిన ఈ నాటకం తెలంగాణ పౌరుషాన్ని తెలుపుతూ మహిళా చైతన్యాన్ని 800 సంవత్సరాలకు పూర్వమే నాగమ్మ నిద్ర లేపిందని తెలిపింది. కరీంనగర్ జిల్లాలో జన్మించిన నాగమ్మ ఉద్యమ స్ఫూర్తితో ‘నాయకురాలు’గా పిలవబడిన ఏకైక మహిళ.. తొలి ఉద్యమకారిణి.. ఈమె ఉద్యమ భావాలకు అద్దం పట్టేలా నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. సభాధ్యక్షుడిగా ఆచార్య అనుమాండ్ల భూమయ్య, కవి డా. నందినిసిద్ధారెడ్డి, గోవర్ధన్ పాల్గొనగా తొలుత సంస్థ వ్యవస్థాపకుడు జి.సత్యనారాయణ స్వాగతం పలికారు.

తెలంగాణ ఉద్యమానికి మర్రి ద్రోహం చేయలేదు
కాచిగూడ, ఫిబ్రవరి 7: తెలంగాణ విషయంలో తప్పని పరిస్థితిలోనే మర్రి చెన్నారెడ్డి రాజీపడాల్సి వచ్చిందని, తెలంగాణ ఉద్యమానికి ఎలాంటి ద్రోహం చేయలేదని ఘంటాపథంగా చెబుతున్నానని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. 1969 తెలంగాణ ఉద్యమ నాయకుడు పిజె సూరి 70వ జన్మదిన వేడుకలు ఎంఎన్.దాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ అప్పట్లో గెలిచిన ఎమ్మెల్యేలందరు వెళ్లిపోవడంతో తప్పని పరిస్థితిలో చెన్నారెడ్డి రాజీపడ్డారే తప్ప తెలంగాణకు ఎలాంటి ద్రోహం చేయలేదని అన్నారు. అందరిని కలుపుకునిపోయే వ్యక్తి పిజె సూరి అని తెలిపారు. తెలంగాణ కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. టిఆర్‌ఎస్ సెక్రటరి, జనరల్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు మాట్లాడుతూ పిజె.సూరి ఉద్యమ నాయకుడిగా ఎన్నో ఉద్యమాలు చేశారని తెలిపారు. ఆయన ఎవరిని నొప్పించే వ్యక్తి కాదని పేర్కొన్నారు. అనంతరం సూరి దంపతులను సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేనారెడ్డి, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, హైకోర్టు న్యాయవాది నర్సింహారెడ్డి, మాధవరెడ్డి, సంస్థ సభ్యులు కృష్ణారెడ్డి, బాలకిషన్‌రావు, రామకృష్ణరావు పాల్గొన్నారు.