హైదరాబాద్

రోగుల పట్ల నిర్లక్ష్యం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, మార్చి 20: రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సోమవారం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డులలో తిరిగి రోగులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజల ఆరోగ్యం పట్ల తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. గాంధీలో ఇటీవల కిందిస్థాయి సిబ్బంది అవినీతి ఆరోపణలపై ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. సిబ్బంది పనితీరుపై ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో గాంధీ ఆసుపత్రి వైద్యాధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. గాంధీలో పరిస్థితులపై చర్చించారు.
అభ్యర్థనలు పరిశీలించండి
అధికారులకు జెసి సుందర్ అబ్నార్ ఆదేశం

హైదరాబాద్, మార్చి 20: ప్రజావాణిలో వచ్చిన అభ్యర్థనలను పరిశీలించి సత్వరమే పరిష్కారం చేసే దిశగా అధికారులు కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ పేర్కొన్నారు.సోమవారం కలెక్టరేటు సమావేశ మందిరంలో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి జాయింట్ కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి సమస్యలను సాధ్యమైనంత త్వరలో పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇతర విభాగాలకు గాని లేదా ఇతర శాఖలకు సంబంధించిన విజ్ఞప్తులుగాని వారికి వచ్చినట్లయితే వాటిని వెంటనే సంబంధిత అధికారులకు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ఏదైనా విజ్ఞప్తి అసంపూర్తిగా ఉన్నట్లయితే ఆ విషయాన్ని దరఖాస్తుదారుని దృష్టికి తీసుకువస్తూ పూర్తి వివరాలతో తిరిగి దరఖాస్తు సమర్పించాలని సూచించాలన్నారు.

మార్కెట్‌లో భగ్గుమన్న మిర్చి రైతులు
సైదాబాద్, మార్చి 20: ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పండించిన మిర్చి పంటకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో రైతులు భగ్గుమన్నారు. దళారులు కుమ్మకై తమకు కనీస మద్దతు ధర దక్కకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం మలక్‌పేట్ మహబూబ్ మెన్షన్ మార్కెట్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. మలక్‌పేట్ మార్కెట్‌కు నిత్యం పలు జిల్లాల నుంచి రైతులు తమ పంటను తరలించి అమ్ముకుంటారు. కొంతకాలంగా మిర్చి రైతులకు క్వింటాలుకు వాటి నాణ్యతను బట్టి ఐదువేల రూపాయల నుంచి ఏడువేల రూపాయలను కమీషన్ వ్యాపారులు ఇచ్చేవారు.