హైదరాబాద్

‘జీవ’ జలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: భూమిపై జీవించే ప్రతి ప్రాణికి ఎంతో అవసరం జీవజలం. ప్రాణవాయువైన ఆక్సిజన్‌ను అన్ని ప్రాణుల శరీరంలోకి ద్రవ రూపంలో అందించే ప్రకృతి ప్రసాదం, పంచభూతాల్లో ఒక్కటి నీరు. అదే అన్ని ప్రాణులకు ఆరో ప్రాణం..విభిన్న కోణాల్లో వికృత రూపాల్లో సాగుతున్న అభివృద్ధి, ఎప్పటికపుడు పెరిగిపోతున్న పట్టణీకరణ, కమ్ముకొస్తున్న కాలుష్యపు నీడల్లో జీవ జలం కనుమరుగవుతోంది. పట్టణీకరణ నేపథ్యంలో ఆడవులను నరికేయటంతో ఎప్పటికపుడు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వర్షాభావం తగ్గుతూనే ఉంది. ఫలితంగా పట్టణాల్లో తాగు, పల్లెల్లో సాగునీరు కనుమరుగవుతున్న గడ్డు పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్రకృతి పరంగా వర్షాలు కురిసేందుకు పర్యావరణ పరంగా అవకాశాలు అంతంతమాత్రమే. ఒకవేళ కురిసినా, వర్షం నీటిని కాపాడుకునేందుకు సరైన వ్యవస్థ అందుబాటులో లేకపోవటం దురదృష్టకరం. ఈ క్రమంలో పాలకుల నిర్లక్ష్యం, ప్రజల అవగాహనరాహిత్యం కారణంగా జీవజలం కోసం ప్రతి వేసవిలో జనం ‘పానీ’పట్టు యుద్దాలు చేయాల్సి వస్తోంది. సరే అవసరాలు తీర్చుకునేందుకు ప్రత్యామ్నాయంగా బోర్లు వేసి నీటిని సమకూర్చుకుంటున్నా, రోజురోజుకి మిలియన్ల గ్యాలన్లలో వినియోగం పెరగటంతో నగరంలో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయాయి. కొన్ని చోట్ల వెయ్యి, 1500, రెండు,మూడు వేల అడుగుల లోతు వరకు బోర్లు వేసినా, నీరు పడని దుస్థితి. విచ్చలవిడి వినియోగం..మొక్కుబడిగా నీటి పరిరక్షణ చర్యలు..వంటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే భావితరాలు చుక్క నీటి కోసం చక్కలు చూడక తప్పని ప్రమాదం పొంచి ఉందని ఇప్పటికే పర్యావరణ వేత్తలు, నీటి రంగ నిపుణులు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కూడా తేల్చి చెబుతున్నా, ఈ దిశగా ఆశించిన స్థాయిలో కృషి జరగటం లేదు. ప్రస్తుతం కూడా నగరానికి తాగునీటిని అందించే జలాశయాల్లో నీటి మట్టాలు కాస్త ఆశాజనకంగానే ఉన్నా, ఈ వేసవిలో కష్టాలు కొంత తక్కువగా ఉంటాయని సర్కారు చెబుతున్నా, నీటి పరిరక్షణ కృషి అనేది నిరంతరం అవసరం. అత్యవసర పరిస్థితుల్లో నగరవాసుల గొంతు తడిపే సింగూరు జలాశయంలో కూడా నీటి మట్టం బాగానే ఉన్నా, ఈ రిజర్వాయర్ నుంచి ఎక్కువ మోతాదులో నీటిని వ్యవసాయానికి వినియోగించాలన్న డిమాండ్లు విన్పిస్తున్నాయి.
పెరగాలి అవగాహన..
ఫలించాలి ‘పరిరక్షణ’
న్న నేపథ్యంలో నగరంలో ఉన్న నీటి వనరులను కాపాడుకునే అంశంపై తక్షణమే యుద్దప్రాతిపదికన ప్రజల్లో అవగాహనను పెంపొందించి, నీటి పరిరక్షణ చర్యలను ఫలించే దిశగా చేపట్టాల్సి ఉంది. కనీసం ఇప్పటి నుంచైనా ప్రయత్నం ప్రారంభం కావాలి. నగరానికి తాగునీటిని అందించే రిజర్వాయర్లలో ఈ సారి పుష్కలంగా నీరుంది కదా అని పరిరక్షణ చర్యలును మరిచిపోతే, మున్ముందు తాగునీరు ఎలా? అన్నది ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ క్రమంలో నగరవాసులు తన బాధ్యతను ఎరిగి కనీసం నీటిని పొదుపును అలవాటు చేసుకోవాలి.
ఒక్కో బొట్టు నీటిని ఇప్పటి నుంచి పొదుపుగా వాడుకోవటం, చెరువులు, కుంటలు వంటివాటిని పరిరక్షించుకుంటే తప్ప నీటి సమస్యను అధిగమించలేం. కనీసం ఇప్పటి నుంచైనా నీటి పొదుపుపై ప్రజల్లో విస్త్రృతంగా ప్రచారం చేసి, వారిని అవగాహనవంతులను చేయటంతో పాటు నీటి విలువ తెలియజేసి, స్వచ్చంధంగా ప్రతి ఒక్కరు నీటిని రక్షించుకునేందుకు నడుం భిగించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇందుకు సర్కారు పక్షాన కూడా చర్యలు మరింత కట్టుదిట్టంగా అమలు చేయాల్సి ఉంది. ముఖ్యంగా నీటి ఇంకుడు గుంతలుంటేనే భవన నిర్మాణ అనుమతులివ్వనున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసినా, అది ఇంకా అమలుకు నోచుకోవటం లేదు. ఇలాంటి నిర్ణయాల అమలుకు ఆలస్యం జరిగినా కొద్దీ దాని వల్ల పూడ్చుకోలేని నష్టం జరిగే అవకాశాల్లేకపోలేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తీవ్ర వర్షాభావం ఏర్పడిన ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ నెలాఖరు నుంచి నగరంలో నీటి ఎద్దడి మరింత ఏర్పడే అవకాశముంది.
నేటి నుంచి రెండురోజుల సదస్సు
నీరు, నీటి సంరక్షణ, పొదుపుగా వినియోగం, ఉన్న నీటి వనరుల సంరక్షణ, నీటి నిల్వలు వంటివి పెంచుకునేందుకు పట్టణ ప్రాంతాల్లో తీసుకోవల్సిన చర్యలు వంటి కీలక అంశాలపై నిపుణులు తన అభిప్రాయాలను వెల్లడించేందుకు జలమండలి, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఇండియన్ వాటర్ వర్క్స్ అసోసియేషన్ హైదరాబాద్ విభాగం, వాటర్ మేనేజ్‌మెంట్ ఫోరంల సహకారంతో ది ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ అనే సంస్థ ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని రెండురోజుల ప్రత్యేక సదస్సు నిర్వహించనుంది. ఇందులో ముఖ్యంగా వాటర్ అండ్ వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్‌కు సరికొత్త టెక్నాలజీ అనే్వషణ అనే అంశంపై నిర్వహించనున్న ఈ సదస్సుకు రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు ముఖ్య అతిధిగా జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి, జలమండలి ఎండి దాన కిషోర్, తెలంగాణ ఇండస్ట్రియలిస్టు వెల్ఫేర్ ఫెడరేషన్ అధ్యక్షులు కె. సుధీర్‌రెడ్డిలు అతిధులుగా హజరుకానున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు.

ఉస్మానియాలో అరుదైన శస్తచ్రికిత్స

చార్మినార్, మార్చి 20: సర్కారు ఆసుపత్రులంటే నమ్మకం సన్నగిల్లిన నేటి రోజుల్లో ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు మరోసారి తమ వృత్తి నైపుణ్యాన్ని చాటారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా 20 సెంటీమీటర్లున్న కంతిని తొలగించి రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా తొలగించిన కణితుల్లో గరిష్ఠంగా 14 సెం.మీ.ల వరకు ఉండేదని, ఇంత భారీ కణితిని తొలగించటం పట్ల అరుదైన గిన్నీస్ రికార్డు సృష్టించామని, ప్రతిపాదనలు గిన్నీస్ బుక్‌కు పంపినట్లు ఉస్మానియా వైద్యులు వెల్లడించారు. ఉస్మానియా ఆస్పత్రి గాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో 60 ఏళ్ల మహిళ పిత్తాశయంలో నుంచి 20సెం.మీ.ల కణితి తొలగించటం ఇదే మొదటిసారి అని వైద్యులు వివరించారు. ఊస్మానియా ఆస్పత్రిలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గ్యాస్ట్రోంటాలజీ విభాగాధిపతి డా. మధుసూదన్, సూపరింటెండెంట్ డా.బిఎస్. మూర్తి, ఆర్‌ఎంవో డా.అంజయ్య వెల్లడించారు. నగరానికి చెందిన హఫిజా బేగం 60 సంవత్సరాల మహిళ గత కోంతకాలంగా కడుపు నోప్పితో బాధపడుతూ చికిత్స నిమిత్తం మూడు నెలల క్రితం ఆస్పత్రికి వైద్యులను సంప్రదించారు. వైద్య పరీక్షలో మహిళ పిత్తాశయ క్యాన్సర్‌తో బాధపడుతోందని గుర్తించినట్లు తెలిపారు. ఆమెకు పిత్తాశయంలో 22 సెం.మీ. కణితిని గుర్తించి, శస్తచ్రికిత్స చేసి తోలగించినట్లు తెలిపారు. ఇంత పెద్ద కణితిని తొలగించటం చాలా అరుదని, ఈ వివరాలను గిన్సీస్ బుక్ ఆఫ్ రికార్డుకు పంపినట్లు వారు తెలిపారు.

ఈ సందర్భంగా శస్తచ్రికిత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్యులను, గ్యాస్ట్రోంటాలజీ బృందాన్ని సూపరింటెండెంట్ అభినందించారు.