హైదరాబాద్

సర్కారు పాలనను ఎండగట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, మార్చి 20: కేంద్ర, రాష్ట్ర పాలన, మోసపూరిత వాగ్దానాలను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి ఎండకట్టాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను ఉపయోగించుకోలేదని దీంతో పార్టీకి నష్టం జరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సోషల్ మీడియా-2017’ సదస్సు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనీల్‌కుమార్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు సోషల్ మీడియా ద్వారానే ప్రజలకు మోదీ.. కేసిఆర్ మోసపూరిత వాగ్దానాలు చేసి రాజకీయంగా లబ్ధి పొందారని విమర్శించారు. కేసిఆర్ మీడియాను బెదిరిస్తూ, వ్యతిరేకంగా వార్తలను ప్రసారం చేస్తే గతంలో రెండు టివి చానల్స్ ప్రసారాలను నిలిపివేశారని అయన గుర్తు చేశారు. త్వరలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో వెబ్ చానల్‌ను ప్రారంభించి ప్రభుత్వ పనితీరును రాష్ట్ర ప్రజలకు చేరవేస్తామని వివరించారు. కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పార్టీ కాదని.. తెలంగాణ రాబంధుల సమితి అని ఎద్దేవా చేశారు. ఇద్దరు చంద్రులూ దొంగలేనని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అశాభావం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా నేడు అత్యంత కీలకమైందని, సోషల్ మీడియా ద్వారానే పాలకుల మోసపూరితమైన వాగ్దానాలను ప్రజలకు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రావణ్, యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి సోషల్ మీడియా ఇన్‌చార్జి రాధిక ఖేరా, యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి బివి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు గురిజాల వెంకట్ పాల్గొన్నారు.

బంగారు తెలంగాణకు బాటలు వేద్దాం

మంత్రి మహేందర్‌రెడ్డి పిలుపు

హైదరాబాద్, మార్చి 20: సిఎం కెసిఆర్ కలలుగంటున్న బంగారు తెలంగాణ సాధనకు నిరంతరం కృషి చేయాలని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లాకు చెందిన టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్ తెలంగాణ రాష్ట్ర విద్యా, ఉపాధి, వౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా ఇటీవల నియమించబడి పదవీ ప్రమాణం చేసిన సందర్భంగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో విద్యా, వౌలిక సదుపాయాల కల్పనలో ఉద్యమ బిడ్డగా నాగేందర్‌గౌడ్ నిరంతరం కృషి చేయాలన్నారు. సిఎం కెసిఆర్‌కు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పేదలకు అందించే అంశంలో చేదో వాదోడుగా ఉంటామన్నారు. రాష్ట్ర పురోభివృద్ధికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని, జిల్లాను విద్యా, పారిశ్రామిక తదితర రంగాలలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలపాలన్నారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు పట్నం అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.