హైదరాబాద్

మైనారిటీలకు రుణాలు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: మైనారిటీలు ఆర్థికంగా ఎదిగేందుకు, స్వయం ఉపాధి కింద వివిధ వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలు ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మజ్లిస్ ఎమ్మెల్యే అబ్దుల్లా బలాలా డిమాండ్ చేశారు. మైనారిటీలకు ఒక శాతం కూడా రుణాలు లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో మైనారిటీ, ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమ శాఖల పద్దుల (డిమాండ్ల)పై ఎమ్మెల్యే బలాలా మాట్లాడుతూ మైనారిటీలకు రూ.2లక్షలకు మించి రుణాలు ఇవ్వడం లేదని అన్నారు. సబ్సిడీ ఎక్కువ మొత్తంలో ఇవ్వాలని కోరారు. షాదీ ముబారక్ పథకం కింద చెల్లిస్తున్న 51 వేల రూపాయలను లక్ష రూపాయలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూసుఫ్‌బాబా, జహంగీర్ పీర్ దర్గా, పహాడీ షరీఫ్ తదితర దర్గాలను అభివృద్ధి చేయాలని కోరారు. మైనారిటీ సంక్షేమానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. చారిత్రాత్మకమైన చార్మినార్ ఆసుపత్రి మరమ్మతులకు నిధులు కేటాయించాలని కోరారు. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని, స్కాలర్‌షిప్స్ మొత్తాన్ని పెంచాలని బలాలా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో డబుల్ బెడ్‌రూం పథకం కింద 1426 ఇళ్లు మాత్రమే నిర్మించారని, అన్ని నియోజకవర్గాల్లోనూ ఇచ్చిన హామీ మేరకు నిర్మించాలని కోరారు.

ఒక్కరూ మిస్ కారాదు!

హైదరాబాద్, మార్చి 24: పోలియో మహమ్మారి నుంచి చిన్నారులను రక్షించేందుకు చుక్కల మందు తప్పకుండా వేయించాలని జిల్లా టాస్క్ఫోర్సు కమిటీ నగరవాసులకు సూచించింది. వచ్చే నెల 2వ తేదీన జాతీయ ఇమ్యూనైజేషన్ డేను పురస్కరించుకుని నగరంలో చుక్కల ముందు పంపిణీ చేయాల్సిన ఏర్పాట్లపై కమిటీ శుక్రవారం జిహెచ్‌ఎంసిలో ప్రత్యేకంగా సమావేశమైంది. అయిదేళ్లలో చిన్నారులు ఒక్కరు కూడా మిస్ కాకుండా మందు పంపిణీ చేయాలని నిర్ణయించింది. పల్స్‌పోలియో నాలుగో విడతగా చేపడుతున్న ఈ మిషన్ ఇంద్రదనుష్ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ శాఖలు చక్కటి సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిహెచ్‌ఎంసి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ రవికిరణ్ మాట్లాడుతూ జిహెచ్‌ఎంసి, కంటోనె్మంట్ పరిధిలోని ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి మార్కింగ్ చేయాలని ఆదేశించారు. మార్కింగ్ కార్యక్రమం తొందరగా పూర్తి కావాలంటూ ఎస్‌పిహెచ్‌వలు కూడా బస్తీలు, అపార్ట్‌మెంట్లు సందర్శించి మార్కింగ్ పూర్తయిందా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించాలన్నారు. ఏప్రిల్ 2 నుంచి అయిదో తేదీ వరకు జరిగే పల్స్‌పోలియో ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో హై రిస్కు ప్రాంతాలను ప్రత్యేకంగా ఫోకస్ చేసి, అక్కడి చిన్నారులకు మందు పంపిణీ చేయాలన్నారు. నూతనంగా ఏర్పడిన రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లా వారీగా కార్యక్రమ వివరాలను తమకు అందజేయాలని సంబంధిత ఇమ్యూనైజేషన్ అధికారులను కోరారు. వైద్యారోగ్య శాఖాధికారి డా. పద్మజ మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలో 9.96 లక్షల ఇళ్లలో అయిదేళ్లలోపు వయస్సు కల్గిన 5.76 లక్షల చిన్నారులకు మందును పంపిణీ చేసేందుకు 3062 పోలియో బూత్‌లు, 47 ట్రాన్సిట్ ప్యాంట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదనపు కమిషనర్ భాస్కరచారి మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 2వేల మహిళా ఆరోగ్య సమితులు ఉన్నాయని, ఈ సభ్యులందరికీ నగరంలోని వివిధ ప్రాంతాలు, బస్తీలపై అవగాహన ఉందన్నారు. సమావేశంలో జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్ హరిచందన, రంగారెడ్డి జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.గణేష్, పల్స్‌పోలియో కోఆర్డినేటర్ రాఘవేంద్ర పటేల్ పాల్గొన్నారు.