హైదరాబాద్

ఎస్సీ, ఎస్టీల రీఅడ్మిషన్ ఫీజు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: సమాజంలో అణగారిన వర్గాల సామాజిక అభివృద్ధి, సమానత్వం, అంటరానితనం నిర్మూలనకు పరితపించిన గొప్ప మానవతావాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ మాజీ విసి ప్రొఫెసర్ ఆర్ వి ఆర్ చంద్రశేఖరరావు, ప్రొఫెసర్ వి ఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా యూనివర్శిటీలో సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి రాజ్యాంగ రచనలో అంబేద్కర్ కృషిని చంద్రశేఖరరావు వివరించారు. అంబేద్కర్ దూరదృష్టిపై ప్రొఫెసర్ విఎస్ ప్రసాద్ మాట్లాడారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి నెట్టివేయబడినపుడు ప్రజా ఉద్యమాల ద్వారానే రక్షించుకోవాలని ప్రొఫెసర్ హరగోపాల్ వ్యాఖ్యానించారు. కార్యక్రమానికి విసి ప్రొఫెసర్ కె.సీతారామారావు అధ్యక్షత వహించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు రీ అడ్మిషన్ ఫీజును రద్దు చేసినట్టు వెల్లడించారు. స్వావెంజర్స్ పిల్లలకు పూర్తిస్థాయి అడ్మిషన్ ఫీజును రద్దు చేసినట్టు పేర్కొన్నారు. ప్రొఫెసర్ కెవై రత్నం, అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్‌వి రాజశేఖర్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సి.వెంకటయ్య పాల్గొన్నారు.

భవన నిర్మాణ కార్మికులకు సదుపాయాలేవీ?
చిక్కడపల్లి, మార్చి 24: భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు పెన్షన్‌తో పాటు అన్ని సదుపాయాలు కల్పించాలని తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు, ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు చేపట్టిన ధర్నాను ఉద్ధేశించి మాట్లాడుతూ నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల పట్ల తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో ఉన్న నిర్మాణ రంగ కార్మికులందరినీ సంక్షేమ బోర్డులో చేర్చాలని, 60 సంవత్సరాలు నిండిన కార్మికులకు మూడువేల రూపాయలు పెన్షన్ అమలు చేయాలని విఙ్ఞప్తి చేశారు. సంఘం ప్రధాన కార్యదర్శి మారగోని ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించాలని, కార్మిక అడ్డాలలో షెల్టర్లు, వౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. నిర్మాణ పనుల నుంచి సెస్ వసూలు చేసేందుకు సరియైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. కార్మికులకు హెల్త్‌కార్డులు, బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. కార్మికుల పిల్లలకు ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి చదువుల వరకు స్కాలర్‌షిప్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కమిషనర్‌కు వినతిపత్రం అందచేశారు. సంఘం ఉప ప్రధాన కార్యదర్శి ఎస్.బాల్‌రాజ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఓరుగంటి యాదయ్య, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎస్.శంకర్‌రావు, కార్యదర్శి కె.రవిచంద్రన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు బి.వెంకటేశం, కార్యదర్శి ఎం.నర్సింహ్మ పాల్గొన్నారు.