హైదరాబాద్

టిఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్‌సుఖ్‌నగర్, మార్చి 24: తెలంగాణ రాష్ట్ర సమతికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం కావడమే నిదర్శనమని ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు పీచర్ వెంకటేశ్వరరావు అన్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని కుమ్మర బస్తీలో శుక్రవారం జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ అనేకానేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు ఎంతో చేరువయ్యామని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని ఎన్నో కార్యక్రమాలను, పథకాలను తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తుందని అన్నారు. పార్టీ గడ్డిఅన్నారం డివిజన్ బిసి సెల్ అధ్యక్షుడు కందికంటి పండరీనాథ్ గౌడ్ మాట్లాడుతూ ప్రజాహిత కార్యక్రమాల్లో తెరాస ముందుందని, గత పాలకులు ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తే, ఇప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో సర్కారు అన్ని విధాలా అభివృద్ధి బాటలో నడిపిస్తున్నదని అన్నారు. కార్యక్రమంలో తెరాస గడ్డిఅన్నారం డివిజన్ బిసి సెల్ ప్రధాన కార్యదర్శి మొలుగు శ్రీకాంత్ రావు, పార్టీ ఏరియా కమిటీ అధ్యక్షుడుడు తోట ఆంజనేయులు, ఇ. సురేష్ రెడ్డి, సీనియర్ నాయకులు ఊర నరసింహ గుప్త, బిక్షపతి ముదిరాజ్, ముత్తరాజు, ప్రేమ్‌నాథ్ గౌడ్ పాల్గొన్నారు.
మాణికేశ్వర్‌నగర్‌లో..
సికిందరాబాద్: తెరాస ప్రభుత్వం అవలంభిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలను మరింత దగ్గర చేస్తున్నాయని తెరాస నాయకుడు ఆలకుంట హరి పేర్కొన్నారు. శుక్రవారం తార్నాక డివిజన్‌లోని మాణికేశ్వర్‌నగర్‌లో చేపట్టిన తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి అనేక ఆటుపోట్లను ఎదుర్కొని తెలంగాణను సాధించిన మహా నాయకుడు కెసిఆర్ అని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలను చేపడుతూ ముందుకు సాగుతున్నారని అన్నారు. నియోజకవర్గంలోని సీతాఫల్‌మండి డివిజన్, మెట్టుగూడ, అడ్డగుట్ట, బౌద్దనగర్ డివిజన్‌లలో మంత్రి పద్మారావు ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు.
రామంతాపూర్‌లో..
ఉప్పల్: రామంతాపూర్ కార్పొరేటర్ గంధం జ్యోత్స్న నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో శుక్రవారం డివిజన్‌లో వాడవాడలా నిర్వహించిన టిఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజాకర్షణగా నిలిచిపోయాయని పేర్కొన్నారు.
మేడ్చల్: మేడ్చల్ పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో టిఆర్‌ఎస్ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతుందని ప్రజలు టిఆర్‌ఎస్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపట్ల ఆకర్షితులై స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సభ్యత్వం తీసుకుంటున్నారని పలువురు నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని పలు కాలనీలతో పాటు మండలంలోని అత్వెల్లి తదితర గ్రామాల్లో చేపట్టిన టిఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుండి బ్రహ్మండమైన స్పందన లభిస్తుందని నాయకులు పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ పాలన దక్షతకు మంత్రముగ్ధులైన ప్రజలు ఉత్సహంగా ముందుకు వచ్చి పార్టీలో క్రీయాశీలక, సాధారణ సభ్యత్వాలు తీసుకుంటున్నారని వివరించారు. కార్యక్రమంలో మల్లికార్జున్, ఈశ్వరయ్య, శ్రావణ్‌కుమార్ గుప్త, రవీందర్‌రెడ్డి, సుధాకర్, వెంకటేశ్, ఇంద్రసేనారెడ్డి, శ్రీను పాల్గొన్నారు.

రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఓయూలో ర్యాలీ
ఉప్పల్, మార్చి 24: తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ కల్పించడానికి యత్నించడాన్ని వ్యతిరేకిస్తూ ఏబివిపి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో కులాలు, మతాల పరంగా విభజన చేసి ఓట్ల రాజకీయాలు చేస్తుందని ఏబివిపి రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప విమర్శించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించేటప్పుడు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినవారికి రిజర్వేషన్లు కల్పించారని, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆలోచన లేకుండా కేవలం ఓట్ల రాజకీయాల కోసం బిసి రిజర్వేషన్లను కొల్లగొడుతుందని ధ్వజమెత్తారు. మతపరమైన రిజర్వేషన్లు చెల్లవని కోర్టులు చెబుతున్నప్పటికీ పట్టించుకోకుండా ప్రభుత్వం ఒంటెద్దు పోకడ పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలని పోరాడుతున్న విద్యార్థులపై పోలీసులతో ఉక్కుపాదం మోపి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు దిలీప్, శ్రీశైలం, జీవన్, అంజి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఆలోచనను విరమించుకోవాలి
మతరపమైన రిజర్వేషన్ల ఆలోచనను ప్రభుత్వం వెంటనే వివరిమించుకోవాలని భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ కన్వీనర్ బొక్క నర్సింహారెడ్డి అన్నారు. బిజెపి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బిజెపి, బిజెవైఎం ఆధ్వర్యంలో శుక్రవారం మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక రోజు ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లపై దాడులు చేసి అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టిన గతి టిఆర్‌ఎస్‌కు పడుతుందనే విషయం మరిచిపోవద్దన్నారు. కార్యక్రమంలో మీడియా కన్వీనర్ రాచూరి రాజశేఖర్, బిజెవైఎం అధ్యక్షుడు శ్రీ్ధర్, నాయకులు నర్సింగ్‌రావు, శ్రీవర్ధన్, గోగిరెడ్డి, లచ్చిరెడ్డి, బాషా, శ్రీ్ధర్, మల్లారెడ్డి, కొమురయ్య, రమేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఉప్పల్: మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బిజెపి నిర్వహించిన ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలివెళ్లిన ఉప్పల్ చిల్కానగర్ బిజెపి నాయకులను పోలీసులు అరెస్టు చేసి సమీప పోలీసు స్టేషన్‌కు తరలించారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, ముస్లింలను బిసిలలో కలిపి రిజర్వేషన్లు అమలు చేస్తామని టిఆర్‌ఎస్ ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ప్రభాకర్ నాయకత్వంలో పార్టీ నాయకులు దేవసాని బాల్‌చందర్, గొరిగె కృష్ణ, మంకాల లక్ష్మణ్, సుమన్ శర్మ, రేవెల్లి రాజు, గోనె అంజయ్య, ఉమేశ్ సింగ్, శ్రీనివాస యాదవ్, వెంకటేశ్వరి, కల్పన, మహేశ్వరి పాల్గొన్నారు. హబ్సిగూడ, రామంతాపూర్, బోడుప్పల్, పీర్జాదిగూడ పురపాలక సంఘాల బిజెపి నాయకులు అరెస్టైన వారిలో ఉన్నారు.