హైదరాబాద్

ప్రజల పక్షాన పౌర సమాజం గొంతెత్తాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్, మార్చి 26: ప్రజలు అందించిన అధికారాన్ని స్వప్రయోజనాలకు వాడుకుంటూ ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే వారి పక్షాన గొంతెత్తాల్సిన బాధ్యత పౌర సమాజంపై ఉందని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొ.కోదండరాం పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో ప్రాణాలను హరిస్తున్న ఔషదాలు, సెలైన్‌లు తిరిగి మార్కెట్‌లోకి రావటం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయి, ఎవరి హస్తం ఉందని ప్రశ్నించారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో డా.జగదీష్ రచించిన ‘ఆరోగ్యం-ప్రజల ప్రాథమిక హక్కు’ పుస్తకాన్ని కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు. ప్రజలు ప్రశ్నించే అవకాశాన్ని ఇవ్వకుండా ప్రభుత్వం పక్కా ప్రణాళిక ప్రకారంగానే నిరసనలకు వేదికైన ధర్నా చౌక్‌ను ఎత్తివేశారని ఆరోపించారు. ప్రభుత్వం చెబుతున్నదే అభివృద్ధి అని, కాదని ధిక్కరిస్తే ఆగ్రహానికి గురి కావాల్సిందేనన్న తీరుగా పాలకులున్నారని విమర్శించారు. ప్రజల పక్షాన నిలబడి, పాలకులు స్వీయ లబ్దికోసం చేసే పనులను ప్రజలు సమూహంగా ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఎంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సమస్యలు పెరిగాయన్నారు. ప్రజలను తట్టి లేపాల్సిన సమయం వచ్చిందని, ప్రభుత్వంతో వ్యక్తిగత వైరం లేదని, ప్రజా సమస్యల పరిష్కారంపై వైరుద్యాలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేటు కార్పొరేటు ఆసుపత్రులకు లబ్ది చేకూర్చుతున్నదని ధ్వజమెత్తారు. ఆరోగ్యం పేరిట ఆసుపత్రులు భారీ దోపిడికి పాల్పడుతున్నాయని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో గత మూడు సంవత్సరాల నుండి నూతనంగా వైద్యుల నియామకం జరుగలేదని ఆరోపించారు. వరంగల్ ఎంజిఎంలో హుద్రోగ నిపుణులు, క్యాన్సర్ నిపుణులు లేక మరణాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రొ.పురుషోత్తం, డా.రమా మేల్కొటే, తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు డా.తిప్పర్తి యాదయ్య, రవీందర్, డా.చీమ శ్రీనివాస్, డా.వీణ, శత్రుఘ్న పాల్కొన్నారు.

వివాహితను వేధించిన నిందితుడి అరెస్టు

హైదరాబాద్, మార్చి 26: ఓ వివాహితను ఫోన్‌లో లైంగిక వేధింపులకు పాల్పడుతోన్న నిందితుడిని షీ టీమ్స్ బృందం అరెస్టు చేసింది. చిత్తూరు జిల్లా రాజసముద్రం మండలం చెంబకూరు గ్రామానికి చెందిన పి బాబజాన్ (26) చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వివాహితను పక్షం రోజులుగా రాత్రి వేళల్లో ఫోన్‌లో అసభ్య పదజాలంతో వేధిస్తున్నాడు. ఇద్దరు పిల్లలున్న ఆమె తన భర్తకు విషయం తెలిస్తే అనుమానాలకు దారి తీసి కుటుంబ పరువుపోతుందని భావించి వౌనంగా ఉంది.
నిందితుడు పదిహేను రోజులైనా ఫోన్ చేయడం మానకపోయే సరికి సదరు విషయాన్ని తన భర్తకు తెలిపింది. దీంతో ఓ రోజు భర్తనే స్వయంగా ఫోన్ లిఫ్ట్‌చేసి బెదిరించాడు. అయినా ఫోన్ కాల్స్ ఆగలేదు. విసుగెత్తిన భార్య, భర్తలు షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న షీ టీమ్స్ ఏసిపి డి కవిత ఓ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. నిందితుడి ఫోన్ నెంబర్ ఆధారంగా చిత్తూరు జిల్లా చెంబకూరు గ్రామానికి వెళ్లిన షీ టీమ్స్ బృందం అక్కడి పోలీసుల సహకారంతో పి బాబజాన్‌ను అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. నిందితుణ్ని చిక్కడపల్లి పోలీసులకు అప్పగించగా ఐపిసి 507, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జుడిషియల్ రిమాండ్‌కు తరలించినట్టు ఏసిపి కవిత తెలిపారు.