హైదరాబాద్

‘సంస్కృతి, సాంప్రదాయాలను మరవకూడదు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: ఢిల్లీ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం తెలుగు లలితకళాతోరణంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం యూనిట్‌కు అభినందన సత్కారాలతో పాటు ఢిల్లీ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య పాల్గొని కళాకారులను సత్కరించి అభినందించారు. తెలుగువాడు ఎక్కడవున్నా సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోకూడదని, పండుగలు ఉత్సాహంగా జరుపుకుంటూ తెలుగు సంస్కృతిని కాపాడుకోవడంలో అందరూ భాగస్వాములు అవ్వాలని అన్నారు. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తెలుగువారు రెండు రాష్ట్రాలుగా వీడిపోయినా సంస్కృతి సంప్రదాయాలలో అన్నదమ్ముల్లా కలిసే ఉంటామని అన్నారు. దేశాభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు ఒకటి రెండు స్థానాల్లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రాలు ఎంత ఎదిగినా ఈనాటి యువతలం సంస్కృతి సంప్రదాయాలు మరువకూడదని, పాశ్చాత్య నాగరికత మోజులో ఉన్న తెలుగు సంస్కృతిని కాపాడుకోవాలని ఈటెల అన్నారు. జస్టిస్ జి.్భవాని ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు జాతి గౌరవాన్ని మర్చిపోకుండా అభివృద్ధిలో కలిసి న్యాయం చేసుకోవాలని, తెలుగు భాషా సంస్కృతులు కాపాడుకవడంలో అందరం చేతులు కలుపుదామని అన్నారు. కార్యక్రమంలో ఎం.దేవరాజరెడ్డి, ప్రొ. ఎస్సీ సత్యనారాయం, జబీర్‌పాటిల్, కె.జలంధర్‌రెడ్డి, సి. మధుసూధనశర్మ, సంతోష్‌గుప్త, అశోక్ జి. గుజ్రాలె, సిఆర్‌కె శేషగిరిరావు, బిక్కి రమేష్‌కుమార్, ఎ.మనోహ్‌రావు, బేబి కలశ మాడపురెడ్డిని సత్కరించి విశ్వభారతి విశిష్ట ప్రతిభ పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణకు జీవనసాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. తొలు ఢిల్లీ అకాడమీ ప్రధాన కార్యదర్శి డా.ఎన్‌విఎల్ నాగరాజు స్వాగతం పలికారు. సినీ సంగీత దర్శకులు కోటి సారథ్యంలో సినీ సంగీత విభావరి జరిగింది.
‘నవలేఖన తెలుగు కథలు’ ఆవిష్కరణ
హైదరాబాద్, మార్చి 26: కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధీనంలోని నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా నలభై ఏళ్లలోపు యువ కథకుల కథా సంకలనం ‘నవలేఖన తెలుగు కథలు’ ఆవిష్కరణ సభ ఆదివారం రవీంద్రభారతిలో జరిగింది. కథా రచయిత, బిసి కమిషన్ అధ్యక్షుడు బిఎస్ ములు ముఖ్యఅతిథిగా పాల్గొని ఆవిష్కరించి మాట్లాడుతూ, నలభై సంవత్సరాల లోపు కథకుల తాజా రచనలు అచ్చుకావడం అభినందనీయమని అన్నారు. కథా సంకలనం సంపాదకుడు ఎఎన్ జగన్నాథ శర్మ, గౌరవ అతిథులుగా వాడ్రేవు చిన వీరభద్రుడు, కవి జూకంటి జగన్నాథం పాల్గొన్నారు. కథా సంకలనంలోని 16మంది రచయితలు కార్యక్రమంలో పాల్గొని తమ నేపథ్యాన్ని వివరించారు. గౌరవ అతిథులు షాజహానా మాట్లాడుతూ ఈ సంకలనంలోని రచయితలందరూ సత్తా ఉన్నవాళ్లని, వీళ్లు ఇలాగే రచనలు చేయాలని అన్నారు. గౌరవ అతిథి జూకంటి జగన్నాథం మాట్లాడుతూ, నలభై ఏళ్లలోపు ఉన్న రచయితలు రాసిన కథలు చెలమ నీళ్లను తోడుకుని తాగినట్టున్నాయని, ప్రాంతాల మధ్య సంబంధాలు కొనసాగాలని, కవులు రచయితలు అందుకు ముందుండాలని అన్నారు. గౌరవ అతిథి కవి, రచయిత, విమర్శకుడు వాడ్రేవు చినవీరభద్రుడు మాట్లాడుతూ, తాను ఎన్‌బిటి పుస్తకాలు చదివి రచయితగా మారానని తెలిపారు. ఎన్‌బిటి రచనలు భారతదేశాన్ని పరిచయం చేసాయని, అందులో ఆ మహత్తు ఉందని అన్నారు. నవ లేఖన కథలన్నీ విలక్షణంగా ఉన్నాయని అన్నారు. కార్యక్రమానికి 20 సంవత్సరాల లోపు కథా రచయితలు కూడా వస్తే బాగుంటుందని అన్నారు. బుక్‌ట్రస్ట్ తెలుగు సంపాదకుడు డా.పత్తిపాక మోహన్ సభకు స్వాగతం పలికారు. కథా రచయితలు చందు తులసి, చైత్య పింగళి, డా.దేవేంద్ర, ఎండ్లూరి మానస, వూరడి మల్లికార్జున్, పూడూరి రాజిరెడ్డి, డి.సాయిప్రమోద్, స్వాతి, అరుణ, ప్రసూన, ఎన్‌బిటి అనువాదకులు కె.రాణిప్రసాద్, ఎం.నారాయణశర్మ, వాడ్రేవు వీరలక్ష్మీదేవి, అరుణ, సాజీదాఖాన్, ఎ.లక్ష్మణ్ పాల్గొన్నారు.