హైదరాబాద్

‘మీ కోసం’లో జాప్యం తగ్గాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: ప్రజాసమస్యల పరిష్కారం కోసం జిల్లా యంత్రాంగం నిర్వహిస్తున్న ‘మీ కోసం’ కార్యక్రమంలో వచ్చిన పిటిషన్ల పరిష్కారంలో జాప్యాన్ని తగ్గించేందుకు అధికారులు వ్యక్తిగత శ్రద్ధ చూపాలని జాయింట్ కలెక్టర్ ఎం. ప్రశాంతి అధికారులకు సూచించారు. సోమవారం ఆమె కలెక్టరేట్‌లో మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. డిఆర్వో సతీష్‌చంద్రతో కలిసి ఆర్జీలను స్వీకరించారు. ఇందులో భాగంగా టోలీచౌకీలోని బృందావన్‌కాలనీ నివాసి రజియాబేగం తాను 2005లో సొంత ఇంటి కోసం రూ. వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకున్నా, నేటికీ మంజూరు కాలేదని, తనకు డబుల్ బెడ్ రూం ఇంటిని కేటాయించాలని వినతిపత్రం సమర్పించింది. అదే విధంగా నాంపల్లి మండలంలోని ఫీల్‌ఖానాకు చెందిన నషీమ్ అనే వికలాంగురాలైన మహిళ బండ్లగూడ మండలంలోని న్యూరాజీవ్‌గాంధీనగర్ కాలనీకి చెందిన మునీమా అనే మహిళ తనకు కూడా ఇళఉల కావాలని కోరింది. అలాగే ఫలక్‌నుమాకు చెందిన కరీమున్నిస్సా, చాంద్రాయణగుట్టకు చెందిన రుక్సానా కూడా ఇళ్లును కోరుతూ వినతిపత్రాలను సమర్పించారు. వాటిపై జేసి స్పందిస్తూ 2005సంవత్సరంలో వెయ్యి రూపాయల చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారందరికి డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యతనివ్వాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. తప్పనిసరిగా అర్హులైన వారందరికి ఇళ్లు కేటాయిస్తామని, ఇందుకు కొంత సమయం పడుతుందని ఆమె వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో వచ్చిన ఆర్జీలు, వినతిపత్రాలు తమ స్థాయిలో పరిష్కరించేందుకు వీలు కాని వాటిని ఉన్నతాధికారులకు పంపి పిటిషన్‌దార్లకు ఆ సమాచారాన్ని అందజేయాలన్నారు. ఈ విధంగా పరిష్కరించిన పిటిషన్లకు సంబంధించి కలెక్టరేటుకు ఇంటరీమ్ రిపోర్టు పంపిః మీ కోసం వెబ్‌సైట్‌లో ఆయా వివరాలను నమోదు చేయాలన్నారు. శాఖల వారీగా జాప్యాన్ని సమీక్షిస్తూ డిఇవో కార్యాలయంలో 10 పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించి వాటిని సత్వరమే పరిష్కరించాలని సూచించారు.
జిల్లా ఉపాధి కల్పనాధికారి పరిధిలో 5, తహసిల్దార్ మారేడ్‌పల్లి పరిధిలో నాలుగు, సికిందరాబాద్ పరిధిలో మూడు, నాంపల్లిలో మూడు, షేక్‌పేటలో నాలుగు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని జేసి సూచించారు. ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి అయిదు గంటల వరకు వివిధ ప్రాంతాల ప్రజలు తనను కలిసి తమ సమస్యలపై పిటిషన్లు ఇస్తుంటారని, వాటిని సంబంధిత తహసిల్దార్లకు తాను ఎండార్స్ చేస్తానని ఇవవరించారు. అలాంటి పిటిషన్లపై ఏం చర్యలు తీసుకున్నారో తనకు తెలియజేయాల్సిందిగా ఆదేశించారు.

శ్రీరామ భక్త సమాజం ఆధ్వర్యంలో

నేటి నుంచి శ్రీ సీతారామ
వసంత నవరాత్రి ఉత్సవాలు

హైదరాబాద్, మార్చి 27: శ్రీరామ నవమి సమీపిస్తుండటంతో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు నగరంలోని భక్త సమాజాలు, ఆధ్యాత్మిక సంస్థలు భారీ ఏర్పాట్లు చేస్తన్నాయి. ఇందులో భాగంగా భక్త సమాజము ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా, వైభవోపేతంగా నిర్వహించే శ్రీ సీతారామ వసంత నవరాత్య్రుత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నాంపల్లి రైల్వే గూడ్స్ గేటు సమీపంలోని శ్రీ రామ హనుమాన్ మందిరం వద్ద ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజైన 28వ తేదీ మంగళవారం ఉదయం అయిదున్నర గంటలకు గణపతి హోమం, ఎనిమిది గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచనము, ఋత్విగ్వరణము, మంటపారాధన, అఖండ దీపం, కలశస్థాపన, వేపపువ్వు ప్రసాదము వంటి కార్యక్రమాలను నిర్వహించన్నుట్లు, అలాగే 29న ఉదయం విష్ణుసహస్రనామ సామూహిక పారాయణం, రాత్రి ఎనిమిది గంటల 15 నిమిషాలకు సురభి నాటక బృందంచే ‘్భక్తప్రహ్లాద’, 30న ‘మాయాబజార్’ నాటక ప్రదర్శనలుంటాయని తెలిపారు. 31న సహస్రనామ కుంకుమపూజ, ఏప్రిల్ 1వ తేదీన ఎన్‌సిహెచ్ పార్థసారథిచే కర్ణాటక సంగీత గాత్ర కచేరీ, 2న ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ సీతారాములకు లక్షపుష్పార్చన, 3న ఉదయం పది గంటలకు శ్రీ సీతారాముల వివాహానికి పసుపు కొమ్ములు దంచు వేడుక, నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే, 4న రాత్రి ‘ఎదురుకోలు ఉత్సవం’, 5న శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఉదయం పదిన్నర గంటల నుంచి రెండు గంటల పాటు శ్రీ సీతారామ కల్యాణము, తలంబ్రాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.