హైదరాబాద్

బస్తీల్లో బల్దియా వైద్య శిబిరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంపొందించటంతో పాటు వారు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు జిహెచ్‌ఎంసి నగరంలోని అన్ని ప్రాంతాల్లో వైద్య శిబిరాలను నిర్వహించేందుకు సిద్ధమైంది. నగరాన్ని మొత్తం ఆరు కస్టర్లుగా ఏర్పాటు చేసి ఈ నెల 31వ తేదీ వరకు శిబిరాలను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజల ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ ఉచిత వైద్య శిబిరాల్లో స్ర్తి, శిశు సంబంధిత స్పెషలిస్టులు కంటి, చర్మ వ్యాధుల పరీక్షలతో పాటు రక్త, మల,మూత పరీక్షలకూడా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. జిహెచ్‌ఎంసి అర్భన్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ శిబిరాలు మంగళవారం దారుషిఫా పరిధిలోని జెజెనగర్ కమ్యూనిటీ హాల్, అమన్‌నగర్ పరిధిలోని సిద్దికీనగర్ ప్రభుత్వ పాఠశాల, నయాపూల్ ఉప్పలమ్మ దేవాలయం అంగన్‌వాడీ కేంద్రంలో, గోల్కొండ నయా ఖిల్లాలో, గోల్కొండ అంబేద్కర్‌నగర్ ఏఎస్‌ఆర్‌నగర్, జాంబాగ్ పార్కు, అంబర్‌పేటలోని ప్రేమ్‌నగర్ కమ్యూనిటీ హాల్, భోలక్‌పూర్‌లోని బాపూజీనగర్ అంగన్‌వాడికేంద్రం, గంగానగర్ అంగన్‌వాడి కేంద్రం, ముషీరాబాద్ రాజాడిలక్స్ సమీపంలోని కమ్యూనిటీ హాల్‌లో ఈ వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ఈ నెల 30వ తేదీన పాతబస్తీలోని డబీర్‌పురా ఆఫ్రీన్ ఫంక్షన్ హాల్‌లో, యాకుత్‌పురాలోని ఇమామ్‌బడా కమ్యూనిటీ హాల్‌లో, ఇసామియా బజార్‌లోని గౌలిగూడ అంగన్‌వాడి కేంద్రం, సుల్తాన్‌నగర్ అచ్చయ్యనగర్ అంగన్‌వాడి, కుమ్మరివాడలోని హరిదాస్‌పురాలో, గుడిమాల్కాపూర్ భోజగుట్టలోని సపోటాబావి అంగన్‌వాడి కేంద్రం, బొగ్గులకుంట శంషార్‌బాగ్ కమ్యూనిటీ హాల్, డిబిఆర్ మిల్స్ బండమైసమ్మ కమ్యూనిటీ హాల్‌లో ఈ వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 31న జగన్‌మహాల్ ఎంసిహెచ్‌క్వార్టర్స్, ఈదీబజార్‌లోని బయ్యాలాల్‌నగర్ అంగన్‌వాడి కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక సౌకర్యాలు

ఖైరతాబాద్, మార్చి 27: అత్యాధునిక సౌకార్యలతో ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం నిమ్స్ ఆసుపత్రిలో సుమారు 11 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన రెండు క్యాథ్ ల్యాబ్ యంత్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో ప్రభుత్వరంగ ఆసుపత్రుల్లో ఈ తరహా యంత్రాలను ఏర్పాటుచేయడం మొదటిసారి అని చెప్పారు. వీటివల్ల గుండె సంబంధ వ్యాధులను గుర్తించడం వేగవంతంగా పూర్తి అవుతుందని చెప్పారు. గతంలో యంత్రాల లేకపోవడంతో హృద్రోగులు ఇబ్బందులు ఎదుర్కొనే వారని వీటిరాకతో ఆ ఇబ్బందులు తప్పుతాయని చెప్పారు. గుండె పరీక్షల్లో ఇప్పుడు నిమ్స్ నెంబర్-1గా నిలిచిందని చెప్పారు. నిన్న, మొన్నటి వరకు రోజుకు 15 మందికి పరీక్షలు జరపడం కష్టతరంగా ఉండేదని, ప్రస్తుతం రోజుకు 25 నుంచి 30 మందికి తేలిగ్గా పరీక్షలు నిర్వహించవచ్చునని చెప్పారు. నిమ్స్‌తో పాటు పేద రోగులకు చికిత్సలు అందిస్తున్న ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో సైతం ఆధునిక యంత్రాలను అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ఇప్పుడిప్పుడే ప్రజలకు నమ్మకం పెరుగుతుందని, దీంతో గతంలో కంటే రెట్టింపుగా రోగులు వస్తున్నారని చెప్పారు. ఎక్కువ మొత్తంలో రోగులు వస్తుండటంతో అడపదడపా కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని వాటిని కొంతమంది బూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని అన్నారు. కొందరు పనికట్టుకొని ప్రభుత్వ ఆసుపత్రులపై దుష్ప్రచారం చేస్తున్నారని.. వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ మనోహర్, వైద్యులు శేషగిరి రావు, సత్యనారాయణ, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.