హైదరాబాద్

చిన్ని చిన్ని ఆశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్,చార్మినార్, మార్చి 27: నగరంలో మెట్రోరైలు పనులెలా జరుగుతున్నాయో గానీ, ప్రతిరోజూ మా ఇంటి ముందు నిర్వహించే మెట్రోరైలు ట్రయల్ రన్ చూస్తుంటే, రైలు ఎపుడెక్కుతానో అంటూ ఆశగా ఉందని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మండలిలో వ్యాఖ్యానించారు. ద్రవ్య వినిమయ బిల్లు, బడ్జెట్‌పై సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఇందులో భాగంగా ఎన్.రాంచందర్‌రావు మాట్లాడుతూ ఒక వైపు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతున్నా, ఎపుడు అందుబాటులో వస్తుందోనని తానూ ఎదురుచూస్తున్నానని వ్యాఖ్యానించారు. తన ఇంటి ముందు నుంచి రోజు మెట్రోరైలు ట్రయల్ రన్ నిర్వహించటం కన్పిస్తోందన్నారు. తెలంగాణ వస్తే తమకు ఉద్యోగాలొస్తాయని ఎంతో మంది నిరుద్యోగులు ఆశపడ్డారని, తన ఫేస్‌బుక్‌లో ఇలాంటి అభ్యర్థనలు దాదాపు పది నుంచి పనె్నండు వరకొచ్చాయని ఆయన సభకు వివరించారు. ప్రభుత్వాసుపత్రుల్లో కాలం చెల్లిన మందులను వినియోగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని గాంధీ ఆసుపత్రిలో జరిగిన ఘటనను ప్రస్తావించారు. ఈ ఘటనకు సంబంధించి మందులను సరఫరా చేసిన ఎజెన్సీ హస్తం ఉండి ఉండవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మహానగరంలో రెండు లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తామని ప్రకటించినా, బడ్జెట్‌లో నిధులు కేటాయించాలేదని ప్రశ్నించారు. అలాగే బిసి కులాల్లో బాగా వెనుకబడిన కులాలకు రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేస్తామని కేటాయింపులు జరిపారని, ఆ నిధులెలా ఖర్చు చేస్తారు? ఇందుకు నియమనిబంధలేమిటీ? అని ప్రశ్నించారు. దీంతో పాటు నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు ఇదివరకు నిర్వహించిన కార్యక్రమాలను ఇపుడు అదే స్పూర్తితో ఎందుకు నిర్వహించలేకపోతున్నామని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్టమ్రొచ్చి, స్వపరిపాలన జరిగే అసలు ధర్నాలే ఉండవని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించిన సందర్భాన్ని గుర్తుచేసి, అందుకేనేమో ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ను తరలించాలని సర్కారు భావిస్తుందా? అంటూ ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకోవాలని సూచించారు.
పాతబస్తీ మెట్రోపై నిర్ణయం తీసుకోండి
మజ్లిస్ సభ్యుడు రజ్వీ మాట్లాడుతూ నగరంలోని మూడు కారిడార్లలో ప్రతిపాదించిన మెట్రోరైలు ప్రాజెక్టుపనులు పాతబస్తీ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో వేగంగా జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా పాతబస్తీ మెట్రోరైలుపై కూడా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అంతేగాక, కులీకుతుబ్‌షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(కుడా)కు గత సంవత్సరం కేవలం రూ. 6కోట్లు కేటాయించారని, ఈ మొత్తం కేవలం జీతాలకే సరిపోతుందని, మరిన్ని నిధులు కేటాయిస్తే, పాతబస్తీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెనుకబడిన ప్రాంతాలు మరింత అభివృద్ది చెందుతాయని రిజ్వీ సూచించారు.