హైదరాబాద్

కాలానికి అనుగుణంగా విశ్వకర్మలు మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: పంచభూతాలకు, సమస్త సృష్టికి మూలం, త్రిమూర్తులకు అధిపతి అయన విశ్వకర్మ వారసులు ప్రస్తుతం గ్రామాల్లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని, అందరూ ఒక తాటిపైకి తీసుకొచ్చి మారుతున్న సమాజానికి అనుగుణంగా మారాలని పలువురు వక్తలు అన్నారు. విశ్వకర్మ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరిగిన హేమలంబి నామ సంవత్సర పంచాంగం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు జాతీయ సమైక్యతను చాటుతున్నారని అన్నారు. విశ్వ బ్రాహ్మణులు ఐక్యతతో సంఘటిత శక్తిగా మారాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ‘విశ్వదర్శిని’ తెలుగు పంచాంగాన్ని స్పీకర్ ఆవిష్కరించారు.
సంఘం తరఫున స్పీకర్‌ను ఘనంగా సత్కరించారు. తొలుత కాంచనపల్లి మోహనాచారి సిద్దాంతి పంచాంగం శ్రవణం చేశారు. ఈ సంవత్సరం ప్రజలు కష్టనష్టాలను ఓర్చుకొని జీవనం సాగిస్తారని, పాడిపంటలు సమృద్ధిగా వుంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు మహేశ్వరం బ్రహ్మచారి, కార్యదర్శి నారాయణగిరి మురళి, గౌరీశంకర్, దాసోడు శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.