కృష్ణ

కిటకిటలాడిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్): కాపుల ఉద్యమం కారణంగా వారంపాటు ప్రయాణికులకు అందుబాటులో లేని రత్నాచల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కిన రెండోరోజు ప్రయాణికులతో కిటకిటలాడింది. గత నెల 31వ తేదీన తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద కాపు ఐక్యగర్జన సందర్భంగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వచ్చే ట్రైన్ నెంబర్ 12717 రత్నాచల్ సూపర్‌ఫాస్ట్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ని తగలపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో 24 బోగీలతో నడిచే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో కొన్ని బోగీలు పాక్షికంగాను, మరికొన్ని బోగీలు పూర్తిగా దగ్ధమైన సంగతి తెలిసిందే. ఆనాటి నుంచి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ని నడపటం కోసం కావల్సిన బోగీలు లేకపోవడంతో ఈ రైలును తాత్కాలికంగా విజయవాడ-విశాఖపట్నం-విజయవాడ మధ్య రద్దుచేశారు. అయితే విశాఖవైపు రాకపోకలు సాగించే ప్రయాణికుల సౌకర్యార్ధం తాత్కాలికంగా 24 బోగీలకు బదులు 17 బోగీలతో సోమవారం 8వ తేదీన ఇరువైపులా గట్టి బందోబస్తు మధ్య నడిపారు. అంటే అప్పటికి కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహారదీక్షలో వున్న దృష్ట్యా రత్నాచల్ వంటి ఎక్స్‌ప్రెస్‌లతోపాటు పలు రైల్వేస్టేషన్లలో ఆర్‌పిఎఫ్, ఆర్‌పిఎస్‌ఎఫ్‌లతో పాటు జిఆర్‌పి పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. అనంతరం సోమవారం ముద్రగడ పద్మనాభం దీక్ష విరమణ చేయగా మంగళవారం విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే ట్రైన్ నెంబర్ 12718 రత్నాచల్ సూపర్‌ఫాస్ట్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులతో కిటకిటలాడింది. అయితే రైల్వే అధికారులు దగ్గరుండి ప్రయాణికులు సురక్షితంగా ఎక్కేవరకు చూసి రైలును నడిపారు. విశాఖవైపు రాకపోకలు సాగించే ప్రయాణికులకు అందుబాటులో 24 బోగీలతో రైలును నడుపుతామని వెల్లడిస్తున్నారు.