హైదరాబాద్

క్షణాల్లో మాటమార్చిన ప్రకాష్‌గౌడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ‘ప్రాణం ఉన్నంత వరకు తెదేపాను విడిచిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా నిలబడి పోరాడి కార్యకర్తలను కాపాడుకొని తెదేపాను నిలబెడతా’ ఇది ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ బుధవారం కాటేదాన్‌లోని కార్యకర్తల సమావేశంలో ఆవేశంగా చెప్పన మాటలు. అలా అన్న కొద్ది గంటల్లోనే రంగారెడ్డి జిల్లా టిడిపి అధ్యక్షుడు, రాజేందర్‌నగర్ శాసనసభ్యులు ప్రకాష్‌గౌడ్ క్షణాల్లో మాటమార్చారు. బుధవారం మధ్యాహ్నం వరకు వివిధ సమావేశాల్లో తాను టిడిపిని వీడేది లేదంటూ బల్లగుద్ది ప్రకటించిన ఎంఎల్‌ఏ ప్రకాష్‌గౌడ్ సాయంత్రానికి మనస్సు మార్చుకున్నారు. హఠాత్తుగా టిడిపికి గుడ్‌బై చెప్పి ముఖ్యమంత్రి కేసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరిపోయారు. టిడిపి జిల్లా అధ్యక్షులుగా గతంలోఉన్న మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సైతం హఠాత్తుగా తీసుకున్న నిర్ణయంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రాజేందర్‌నగర్ ఎంఎల్‌ఏ ప్రకాష్‌గౌడ్‌కు జిల్లా పార్టీ బాధ్యతలను అప్పగించారు. ఆయన బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజులకే తీగల కృష్ణారెడ్డి పార్టీని వీడడం, అదే సమయంలో ప్రకాష్‌గౌడ్‌కూడా టిఆర్‌ఎస్‌లో చేరేందుకు ముఖ్యమంత్రిని కలిసి రావడం అప్పట్లో సంచలనమే సృష్టించింది. మంగళవారం కుత్బుల్లాపూర్ ఎంఎల్‌ఏ వివేక్ టిఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలసిందే. అదే సందర్భంలో తాను టిడిపిని వీడేది లేదంటూ ప్రకటించిన ప్రకాష్‌గౌడ్ బుధవారం టిటిడిపి కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావుతో కలిసి ముఖ్యమంత్రి సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరడం అందర్నీ ఆశ్చర్యాన్ని గురిచేసింది. ఇప్పటికే జిల్లాలో అంతంత మాత్రంగా ఉన్న టిడిపికి ఇద్దరు శాసనసభ్యులు పార్టీని వీడిపోవడంతో పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి నెలకొందని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. త్వరలో భారీ సంఖ్యలో టిడిపి శ్రేణులు పార్టీకి గుడ్‌బై చెప్పి టిఆర్‌ఎస్‌లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. దీనికి త్వరలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభా వేదికపై పార్టీలో చేరాలని నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తుంది.