హైదరాబాద్

పేదలకు కార్పొరేట్ ఆసుపత్రులు వైద్య సేవలు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఏప్రిల్ 16: కార్పొరేట్ ఆసుపత్రులు కేవలం వ్యాపార ధోరణితో కాకుండా పేదలకు రాయితీతో కూడిన వైద్య సేవలు అందించాలని డిప్యూటీ సిఎం మహమూద్ అలి సూచించారు. ఆదివారం వరల్డ్ వాయిస్ డేను పురస్కరించుకొని విరించి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ‘మెలోడి వాయిస్ సెంటర్’ను సినీ రచయిత తనికెళ్ల భరణితో కలిసి ప్రారంభించారు. నగరంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఇక్కడి పేద రోగులకు మానవతా దృక్పదంతో వైద్యసేవలను సైతం అందించాలని కోరారు. ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా ఆసుపత్రుల్లో అన్ని రకాల సేవలు అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు.
అనంతరం వాయిస్ సర్జరీ అండ్ కేర్ ఆఫ్ ప్రొఫెషనల్ వాయిస్ అనే అంశంపై సదస్సును నిర్వహించారు. వైద్యనిపుణుడు ఫణీంద్ర మాట్లాడుతూ వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతో గొంతు సంబంధ సమస్యలు పెరిగిపోతున్నాయని చెప్పారు. వీటితో పాటు కొందరిలో జన్యూ సంబంధ లోపాలు సైతం కారణమవుతున్నాయని పేర్కొన్నారు. ఇతర వ్యాధులతో పోల్చితే గొం సమస్యలను అలక్ష్యం ఛేస్తుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. సమస్యను గుర్తించిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వైద్యులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో సినీ నటుడు ఉత్తేజ్, ఆసుపత్రి ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ శ్రీనివాస్, వైద్యులు మూర్తి పాల్గొన్నారు.

ఆకట్టుకున్న లయన్స్ క్లబ్ ‘శతోత్సవం’

హైదరాబాద్, ఏప్రిల్ 16: లయన్స్ క్లబ్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సంబరాలు ఆకట్టుకున్నాయి. సికిందరాబాద్‌లోని డ్రీమ్‌లాండ్ గార్డెన్స్‌లో ‘శతోత్సవం’ పేరిట రెండురోజుల పాటు జరిగిన మహాసభలో లయన్స్ క్లబ్ పలు కీలక తీర్మానాలు చేసింది. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ 320 గవర్నర్ ఎ.వెంకటాచలంతో పాటు క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్లు సంజయ్ కేతన్, ఆర్.సునీల్‌కుమార్.. ఉత్సవాలనుద్దేశించి కీలకోపన్యాసం చేశారు. కంటి వైద్యం, నిరుద్యోగులకు స్కిల్ డెవలప్‌మెంట్, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన తీరును క్లబ్ గవర్నర్ డా.వెంకటాచలం వివరించారు. ఆయా ప్రభుత్వ ఆసుపత్రులకు క్లబ్ ఆధ్వర్యంలో అందుతున్న ఉచిత ఆక్సిజన్ సిలెండర్ల సరఫరాను సభకు వివరించారు. క్లబ్ దత్తతకు తీసుకున్న గ్రామాల్లో అభివృద్ధిని సభకు వివరిస్తూ పలు గ్రామీణ ప్రాంతల్లా స్వచ్ఛమైన మంచినీరు అందిస్తున్నట్లు తెలిపారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన అనేక మంది విద్యార్థులను పలువురు లయన్స్ క్లబ్ ప్రతినిధులు దత్తతకు తీసుకున్నట్లు వివరించారు. వారి ఉన్నత చదువులకు తామే ఆర్థిక సహాయాన్ని అందిస్తామని సభాముఖంగా వెల్లడించారు. ఈ వందేళ్లలో లయన్స్ క్లబ్ చేపట్టిన పలు సామాజిక కార్యక్రమాలను ఆయన సమీక్షించారు. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను కూడా ఆయన వివరించారు. మహాసభలో లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్లు సూరత్‌సింగ్ మల్హోత్ర, బిఎన్ రెడ్డి, నరేంద్రరెడ్డి, బండారు ప్రభాకర్, డా.చంద్రకాంత్‌రావు, సాయికుమార్‌రెడ్డి, దేవేంద్ర బండారి, ఎమ్మార్కే రెడ్డి పాల్గొన్నారు.
నూతన గవర్నర్ల ఎన్నిక
2017-18 సంవత్సరానికి లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ 320ఏ నూతన గవర్నర్‌గా ఎస్.నరేందర్‌రెడ్డిని, ఫస్ట్ వైస్ గవర్నర్‌గా బండారు ప్రభాకర్, సెకండ్ గవర్నర్‌గా రమేష్‌చంద్ర పండిట్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు క్లబ్ ప్రతినిధులు వెల్లడించారు.