హైదరాబాద్

అక్రమాలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: మహానగరంలో జిహెచ్‌ఎంసి అనుమతి పొందిన, అనుమతుల్లేకుండా అక్రమంగా ఏర్పాటు చేసిన హోర్టింగ్‌ల లెక్క తేలటం లేదు. లెక్కల్లో ఉన్న హోర్డింగ్‌లు ఎంత కాలం ధృడంగా ఉంటాయో తెలియని అయోమయం నెలకొంది.
అధికారుల వద్దనున్న లెక్కల ప్రకారం రెండువేల పై చిలుకు హోర్డింగ్‌లుండగా, ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో 5వేల పై చిలుకు ఉండవచ్చునని ఆరోపిస్తున్నారు. హోర్డింగ్‌లలో ఎన్నో అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హోర్డింగ్‌లు, యునిపోల్స్‌ల నియంత్రణకు త్వరలోనే సరికొత్త పాలసీని తెచ్చేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.
ప్రతి హోర్డింగ్ ఏఐఎన్(అడ్వర్‌టైజ్‌మెంట్ ఇండెక్స్ నెంబర్)ను కేటాయిస్తున్నా, దానికి సంబంధించి ఫైళ్లలో వివరాలు మరోలా ఉంటున్నాయి. వీటి నిర్వహణను మెరుగుపరిచేందుకు త్వరలోనే సరికొత్త పాలసీని తీసుకురానున్నారు.
ముఖ్యంగా పలు హోర్డింగ్‌లకు సంబంధించి జిహెచ్‌ఎంసిలో ఖచ్చితమైన నియమావళి లేకపోవటంతో క్షేత్ర స్థాయిలో ఉన్న హోర్డింగ్ సైజులకు, రికార్డుల్లో ఉన్న లెక్కలకు పొంతన లేకుండా ఉంటున్నాయి. అంతేగాక అధికారులు వీటి నిర్వాహణను గాలికొదిలేయటంతో చిన్నపాటి గాలులు వీచినా, బలంగా వర్షం కురిసినా, ఇవి కూలి దారిన వెళ్లే వారికి ప్రమాదంగా మారుతున్నాయి. కొత్త పాలసీని రూపకల్పన చేసేందుకు గాను దేశంలోని వివిధ నగరాల్లో అనుసరిస్తున్న అడ్వర్‌టైజ్‌మెంట్ పాలసీలపై జిహెచ్‌ఎంసి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
పార్కింగ్ ఫీజుల నియంత్రణ
వ్యాపార సంస్థలు, మెయిన్‌రోడ్లు, షాపింగ్ మాల్స్‌లలో ఇష్టారాజ్యంగా కొనసాగుతున్న పార్కింగ్ ఛార్జీల వసూలుకు జిహెచ్‌ఎంసి చెక్ పెట్టనుంది. కొన్ని పేరుగాంచిన వ్యాపార సంస్థలు, షాపింగ్ మాల్స్‌లో ప్రతి గంటకు ఎక్కువ మొత్తంలో పార్కింగ్ ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న విషయాన్ని కౌన్సిల్‌లో సభ్యులు లేవనెత్తారు. ఇందుకు కోసం ప్రత్యేకంగా పార్కింగ్ అథారిటీని అందుబాటులోకి తేనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ఈ షాపింగ్ మాల్స్ పార్కింగ్ ఛార్జీల వ్యవహారంపై త్వరలోనే సంప్రదింపులు జరిపి నియంత్రించాలని జిహెచ్‌ఎంసి అధికారులు భావిస్తున్నారు.
కొత్త పార్కింగ్ అథారిటీ ప్రకారం వీలున్న చోట ఉచిత పార్కింగ్‌ను అందుబాటులోకి తేవటంతో పాటు అన్ని వ్యాపార సంస్థల్లో ఒకే రకమైన ఛార్జీలను అమలు చేయాలన్న ఆలోచనలో జిహెచ్‌ఎంసి అధికారులున్నారు.