హైదరాబాద్

తల్లిదండ్రులను గౌరవించడం భారతీయ సంస్కృతి: స్వామిగౌడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: ప్రస్తుత కాలంలో ఉన్నత చదువులు, ఉద్యోగాల పేరుతో తల్లిదండ్రులను తక్కువగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులను గౌరవించడం భారతీయ సంస్కృతి అని తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. పుట్టినరోజున సంతోషంగా ఉంటే సంవత్సరమంతా సంతోషంగా ఉంటాము అనే అభిప్రాయం స్వామిగౌడ్ వ్యక్తం చేసారు. రాజేంద్రనగర్, గండిపేట మండలాలలోని గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం పదహారవ వార్షికోత్సవం గురువారం రవీంద్రభారతిలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్వామిగౌడ్ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరూ తల్లిదండ్రులను గౌరవించాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలని లేని పక్షంలో మీ పిల్లలు కూడా అలానే చేస్తారనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ ఆచార్య, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, టి.మల్లేశ్ పాల్గొన్నారు. తొలుత సంస్థ ప్రధాన కార్యదర్శి ఎస్.ఎన్.రెడ్డి స్వాగతం పలకగా అధ్యక్షులు పాపిరెడ్డి ఇతర గుర్తింపు పొందిన పాఠశాలల కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు. తొలుత పాఠశాల బాలికలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహుతులను అలరించారు.

టెస్ట్‌ట్యూబ్ సెంటర్ మోసంపై
హోర్డింగ్ ఎక్కి హల్‌చల్
ఖైరతాబాద్, ఏప్రిల్ 20: సంతానం కోసం టెస్ట్ ట్యూబ్ సెంటర్‌ను ఆశ్రయిస్తే తనను మోసం చేశారంటూ ఓ వ్యక్తి హోర్డింగ్ ఎక్కి హల్‌చల్ చేశాడు. సైఫాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన లక్ష్మీకాంత్ కారు డ్రైవర్. వివాహం జరిగి చాలా కాలం అయినా పిల్లలు కలగకపోవడంతో కూకట్‌పల్లిలోని సృష్టి టెస్ట్‌ట్యూబ్ సెంటర్‌ను ఆశ్రయించారు. వివిధ పరీక్షలు, చికిత్సల నిమిత్తం సుమారు రూ. 15 లక్షలు వరకు ఖర్చు చేయించారు. అయినా లక్ష్మీకాంత్‌కు పిల్లలు కలగలేదు. దీంతో తాను చెల్లించిన డబ్బును తిరిగి చెల్లించాలని వైద్యురాలు నమ్రతాను కోరగా ఆమె దౌర్జన్యంగా ప్రవర్తించింది. దీంతో లక్ష్మీకాంత్ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా విచారణ జరిపిన కోర్టు లక్ష్మీకాంత్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన వైద్యురాలి భర్త రూ. 10 లక్షలు చెల్లిస్తామంటూ చెక్కు అందించాడు. చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేయగా బౌన్స్ అయింది. తిరిగి ఆసుపత్రికి వెళ్లి ఇదేమిటంటూ డాక్టర్ నమ్రతను నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాక డబ్బులు చెల్లించేది లేదంటూ తేల్చిచెప్పారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మీకాంత్ ఐమ్యాక్స్ చౌరస్తాలో ఉన్న టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న సైఫాబాద్ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని బాధితుడు లక్ష్మీకాంత్‌కు నచ్చజెప్పి, ఫైర్ ఇంజన్ సహాయంతో అతన్ని కిందికి దించారు. అనంతరం అతన్ని స్టేషన్‌కు తరలించి కౌనె్సలింగ్ సెంటర్‌కు పంపించారు.