హైదరాబాద్

జీవన ప్రమాణాల పెంపునకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: మహానగరంలో ప్రజా జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తోందని రాష్ట్ర ఐటి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె. తారకరామారావు వెల్లడించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, అధికారులు పట్టుదల, అంకితభావంతో ప్రజలకు ప్రయోజనం చేకూరుతోందన్నారు. రిజర్వాయర్ల ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తీవ్ర నీటి ఎద్దడితో అల్లాడిపోతున్న నగర శివారు ప్రాంతాలకు కొత్తగా రిజర్వాయర్లు అందుబాటులోకి వస్తున్న కొద్దీ తాగునీటి సరఫరా మెరుగుపడుతోందన్నారు. తాగునీరు, రోడ్లు, కరెంటు సరఫరా వంటివి మెరుగుపడితేనే భూముల ధరలు, అలాగే పారిశ్రామిక పరంగా పెట్టుబడులు పెరుగుతాయని ఆయన వ్యాఖ్యానించారు. శేరిలింగంపల్లి ప్రాంతంలో కేవలం తెలంగాణ వారే గాక, దేశంలోని వివిధ వర్గాలకు చెందిన వారంతా నివాసముంటారని, ఇదో మినీ భారత్ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకముందు నగరంలో కరెంటు, తాగునీటి సరఫరా విషయంలో విపరీతమైన సమస్యలుండేవన్నారు. ప్రతిరోజు విద్యుత్ కోతల బాధలు, ఖాళీ కుండల ప్రదర్శనలు వంటివి దర్శనమిచ్చేవని వివరించారు. కానీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక చొరవతో ఏళ్లు పడుతుందని భావించిన కరెంటు సమస్య కేవలం నెలల వ్యవధిలోనే పరిష్కారమైందని తెలిపారు. రాష్ట్రం మొత్తం కూడా నల్లాల ద్వారా తాగునీటిని అందించాలన్న ముఖ్యమంత్రి భగీరథ ప్రయత్నంలో భాగంగానే నేడు ఈ నాలుగు రిజర్వాయర్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. శివార్లకు
తెలంగాణలో ఉన్నవాళ్లంతా మా వాళ్లే
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవాళ్లంతా మా వాళ్లేనని, వారు ఇక్కడే ఉంటూ తమ వ్యాపారాలు, ఇతర పనులను చేసుకోవచ్చునని హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి అన్నారు.
రిజర్వాయర్ల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా హజరైన ఆయన ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దేశంలో ఎవరూ చేపట్టని తరహాలో సిఎం కెసిఆర్ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. అలాగే హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కూడా కృషి చేస్తున్నారని, అన్ని రకాల వౌలిక వసతులు సక్రమంగా ఉండి, అందరి భాగస్వామ్యంతోనే విశ్వనగరం సాధ్యమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం

హైదరాబాద్, ఏప్రిల్ 20: మహానగరంలో రోడ్లను మెరుగుపరిచి, ట్రాఫిక్ జాం, వాహనదారులను ఇబ్బందులు తగ్గించేందుకు అత్యధిక ప్రాధాన్యతినిస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె. తారకరామారావు తెలిపారు. జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో రూ. 3 కోట్లతో నిర్మించిన వంతెనను, రూ. 3.88 కోట్ల వ్యయంతో చేపట్టిన మల్కచెరువు, నల్లగండ్ల చెరువుల అభివృద్ధి పనులను ఆయన గురువారం పరిశీలించారు. కూకట్‌పల్లి ఎల్లమ్మబండ క్రాస్‌రోడ్డ నుంచి ఆల్విన్‌కాలనీకి వెళ్లే మార్గంలో రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిని మంత్రి ప్రారంభించారు. ఈ బ్రిడ్జి ప్రారంభంతో ఓల్డ్ ఆల్విన్‌కాలనీ బ్రిడ్జిపై ట్రిఫిక్ గణనీయంగా తగ్గటంతో పాటు జదగ్గిరిగుట్ట నుంచి మూసాపేట జెఎన్‌టియు రోడ్డు మార్గంలో రాకపోకలు మరింత సులభం కానున్నాయి. శేరిలింగంపల్లిలోని నల్లగండ్ల పెద్ద చెరువు అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. జిహెచ్‌ఎంసికి చెందిన రూ. 2.25 కోట్లతో పెద్దచెరువుకు చైన్‌లింగ్ ప్రహరీ నిర్మాణం, చెరువు కట్టపటిష్టత, వాక్ వే, టాయిలెట్ల బ్లాక్ నిర్మాణం, విద్యుదీకరణను చేపట్టింది. రనగరంలోని చెరువుల పునరుద్దరణ, అభివృద్ధిలో భాగంగా ఈ చెరువు అభివృద్ధి పనులను చేపట్టింది. అనంతరం కోటి 60లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు జరుగుతున్న మల్కచెరువును కూడా మంత్రులు కెటిఆర్, నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ నగరంలోని చెరువుల అభివృద్ధికి తాము చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు. స్థానిక సంక్షేమ సంఘాలు కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు. నగరంలో అధిక శాతం చెరువుల్లో గుర్రపు డెక్క ప్రధాన సమస్యగా మారిందని, దీనికి ప్రధాన కారణం కలుషిత జలాలులను చెరువులోకి వదలటమేనని వివరించారు. నగరంలోని చెరువుల అభివృద్ధిని చేపట్టడానికి పలు కార్పొరేట్ సంస్థలు కూడా ముందుకొస్తున్నాయని పేర్కొన్నారు. మంత్రితో పాటు ఎంపి కొండా విశే్వశ్వర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గాంధీ, డిప్యూటీ మేయర్ ఫసియుద్దిన్ మేయర్లు పాల్గొన్నారు.