కృష్ణ

సిఎస్‌ఐ వేదికగా తపాలా కార్యకలాపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), ఏప్రిల్ 24: తపాలా శాఖలో అన్ని రకాల కార్యకలాపాల నిర్వహణకు నూతనంగా ప్రవేశ పెట్టిన సిఎస్‌ఐ వేదికగా మారుతుందని ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బాల సుబ్రహ్మణ్యన్ అన్నారు. రాష్ట్రంలో మొట్ట మొదటిగా కలెక్టరేట్ ప్రాంగణంలోని చిలకలపూడి పోస్టల్ కార్యాలయంలో సిఎస్‌ఐ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార సాంకేతిక, వౌలిక సదుపాయాల నిర్మాణానికి, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ అమలుకు సిఎస్‌ఐ ప్రాజెక్టును ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. వినియోగదారుని పరస్పర చర్యల మాధ్యమము, కాల్ సెంటర్, వెబ్ పోర్టర్, మొబైల్ పరికరాల ద్వారా సేవలను అందించడం జరుగుతుందన్నారు. ఐటి మెయిల్ కార్యకలాపాల ద్వారా మెరుగైన ఆర్టికల్ ట్రాకింగ్, సాంకేతిక విజ్ఞాన ఆధారిత లాజస్టిక్ నెట్‌వర్క్ తదితర సేవలను పొందుపర్చామన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సర్కిల్ అడిషనల్ డైరెక్టర్ వై రామకృష్ణ, మచిలీపట్నం పోస్టల్ సూపరింటెండెంట్ సిహెచ్ సూర్యనారాయణ, అసిస్టెంట్ సూపరింటెండెంట్ బి శ్రీనివాసరావు, సబ్ డివిజనల్ హెడ్స్ పాల్గొన్నారు.

ఘనంగా జాతీయ పంచాయతీ దినోత్సవం
కూచిపూడి, ఏప్రిల్ 23: జాతీయ పంచాయతీ దినోత్సవాన్ని మొవ్వ మండలంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లోని పంచాయతీల్లో మాజీ సర్పంచ్‌లను, సంఘ సేవకులను దుశ్శాలువతో, జ్ఞాపికలతో సత్కరించారు. ఇందులో భాగంగా మొవ్వలో పంచాయతీల ఆర్థిక సహకారంతో తయారైన మూడు చెత్తబళ్లను ప్రజలకు అంకితం చేశారు. అలాగే చెత్తను నిల్వ చేసేందుకు డబ్బాలను అందజేశారు. కూచిపూడి గ్రామ పంచాయతీలో మాజీ సర్పంచ్‌లు వైకెడి ప్రసాదరావు, పెనుమూడి కాశీవిశ్వనాధం, మద్దాల నాగభూషణరావులను సంఘ సేవకులు వి వెంకటేశ్వరరావు, కిషన్, వంశీలను దుశ్శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపిపి కిలారు మంగమ్మ, సర్పంచ్ తాతినేని పిచ్చేశ్వరరావు, చిందా వీరవెంకట నాగేశ్వరరాజు, కందుల జయరామ్, ఎంపిపి కావూరి భానుమూర్తి, కంభం రామలక్ష్మి, ఎంపిడివో వై పిచ్చిరెడ్డి, తహశీల్దార్ రామ్‌నాయక్, కార్యదర్శి రాజేంద్రప్రసాద్, రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డుప్రమాద మృతులకు మంత్రి రవీంద్ర సంతాపం
మచిలీపట్నం(కోనేరుసెంటర్), ఏప్రిల్ 24: మచిలీపట్నం-విజయవాడ ప్రధాన రహదారిపై వీరాయిలంక శివారు శ్రీమద్దిరావమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇరువురు విద్యార్థుల కుటుంబ సభ్యులను సోమవారం మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. ప్రమాదంలో మృతి చెందిన వడుగు నితీన్ వర్మ, మైలా రాజ్‌దీప్‌ల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతదేహాలకు త్వరితగతిన పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించాలని వైద్యులను ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, టిడిపి పట్టణ అధ్యక్షుడు ఇలియాస్ పాషా తదితరులు ఉన్నారు.

పంచముఖ అమృతలింగేశ్వరస్వామిని దర్శించుకున్న పురంధ్రీశ్వరి

జగ్గయ్యపేట రూరల్, ఏప్రిల్ 24: ముక్త్యాల గ్రామ సమీపంలో వేంచేసి ఉన్న శ్రీకోటిలింగాల హరిహర మహాశైవ క్షేత్రాన్ని సోమవారం కేంద్ర మాజీ మంత్రి, బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురంధ్రీశ్వరి సందర్శించారు. పంచముఖ అమృతలింగేశ్వరస్వామి అభిషేకాల్లో, కామాక్షి అమ్మవారి పూజల్లో ఆమె పాల్గొన్నారు. క్షేత్రానికి విచ్చేసిన పురంధ్రీశ్వరికి ఆలయ కార్యనిర్వహణ అధికారి ధూళిపాళ సుబ్రహ్మణ్యం, సిబ్బంది అర్చక బృందం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి పట్టువస్త్రాలతో సత్కరించారు. క్షేత్ర మహత్యాన్ని, ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఇఒ ఆమెకు తెలియజేశారు.
రాయితీని సద్వినియోగం చేసుకోండి
జగ్గయ్యపేట, ఏప్రిల్ 24: ఆస్తి, కుళాయిల పన్నులను ఈనెలాఖరులోగా ముందుగా చెల్లిస్తే ఐదు శాతం రాయితీ లభిస్తుందని ఈ అవకాశాన్ని పట్టణ వాసులు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు కోరారు. సోమవారం నిర్వహించిన డయల్ యువర్ చైర్మన్ కార్యక్రమంలో భాగంగా ప్రజలను ఆయన ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అలానే మంచినీటి సమస్య, రోడ్లపై భవన నిర్మాణ సామగ్రి, పిబి కాలువల సమస్యలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయన అధికారులకు ఆదేశాలను జారీ చేశారు.