హైదరాబాద్

అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 6: స్వరాష్ట్రం స్వపరిపాలనలో ప్రజలకు కార్పొరేట్ వైద్యానికి దీటుగా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే అర్థరహితమైన ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి విమర్శించారు. శనివారం మంత్రి నగరంలోని పెట్లబురుజు ఆసుపత్రిలో రూ. కోటి 64లక్షల 66వేల వ్యయంతో ఏర్పాటు చేసిన ఓఐసియు యూనిట్‌ను, ఉస్మానియా ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలను ప్రారంభించారు. కొద్దిరోజుల క్రితం కోఠిలోని ప్రసూతి వైద్యశాలను సందర్శించిన కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై చేసిన విమర్శలను ఆయన ఖండించారు. కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉన్నపుడు ఏం చేశారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ హయంలో రాష్ట్రం అన్నిరంగాల్లో, అన్ని రకాలుగా నష్టపోయిందన్నారు. ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా కార్పొరేట్ ఆసుపత్రులకు మించిన ఆధునిక పరికరాలు అందుబాటులోకి తెచ్చామని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడకు వచ్చే గర్భిణిలకు, బాలింతలకు ఈ యూనిట్ ఎంతో ఉపయోగపడుతోందన్నారు. త్వరలోనే నిలోఫర్ ఆసుపత్రి, సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రిలో కూడా ఇలాంటి యూనిట్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకుని సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి వరకు సేవలను ఆధునీకరించామని, గతంతో పోల్చితే ఈసారి ఎక్కువ మంది ప్రభుత్వాసుపత్రుల సేవలను వినియోగించుకునేందుకు ముందుకొస్తున్నారని ఆయన వివరించారు. గత ఏడాదితో పోల్చితే సర్కారు దవాఖానాలకు వచ్చే రోగుల శాతం ఇరవై వరకు పెరిగిందని మంత్రి వివరించారు. సేవలు మెరుగుపర్చినందుకే గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులతో పాటు నిలోఫర్, పెట్లబురుజు, కోఠి ప్రసూతి వైద్యశాలకు వస్తున్న రోగుల సంఖ్య పెరిగిందన్నారు. సర్కారు ఆసుపత్రులపై వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. ఈ సందర్భంగా పలువురు నర్సులు, ఔట్ సోర్సు ఉద్యోగులు తమ సమస్యలను మంత్రికి వివరించగా, అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే మరిన్ని నియామకాలు పూర్తయితే నర్సుల మీద పని ఒత్తిడి తగ్గుతుందన్నారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యేలు పాషాఖాధ్రి, రాజాసింగ్, కార్పొరేటర్లు సోనీయాదవ్, ప్రజాప్రతినిధులు, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌తివారీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, డిఎంఇ రమణి, డిహెచ్ లలితకుమారి, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి ఎండి వేణుగోపాల్‌తో పాటు ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ఆర్‌ఎంవోలు పాల్గొన్నారు. భర్తీ చేసుకోండి!