హైదరాబాద్

పగటి వేళల్లో దొంగతనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12: పగటి వేళల్లో ఇళ్లకు వేసి ఉన్న తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడే బాల నేరస్తుడు సహా ముగ్గురు సభ్యుల ముఠాను గాంధీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.25 లక్షల విలువైన కేజి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ జోన్ డిసిపి శుక్రవారం వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి వలస వచ్చి సికింద్రాబాద్‌లోని వారాసిగూడ ప్రాంతంలో నివశిస్తున్న ఈ ముగ్గురు దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఈ ఈముఠాలో ప్రధాన నిందితురాలు తల్లి కావడం విశేషం. పలివెల మంగమ్మ తన 16 ఏళ్ల కుమారుడు ప్రసాద్ అలియాస్ దుర్గాప్రసాద్‌ను దొంగతనాలకు ప్రోత్సహించింది. ఏడవ తరగతి వరకు చదుకున్న ప్రసాద్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మానేసి చిన్న చిన్న ఇనుప వస్తువులు దొంగిలించి డబ్బులు సంపాదించడం నేర్చుకున్నాడు. తల్లి కూడా ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో ఇలా దొంగతనాలు చేయడాన్ని ప్రోత్సహించింది. ఈ కేసులో రెండో నిందితుడు టేకిమూడి శ్రీనివాసరావు కూడా కలిసి ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో గత నెల 25న కవాడిగూడలోని భాగ్యలక్ష్మి నగర్‌లో తాళం వేసి ఉన్న ఇంట్లోకి ప్రవేశించి బీరువా తాళం పగుల గొట్టి కిలో బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు.
బాధితురాలు ఫిర్యాదు చేసిన మేరకు కేసు నమోదు చేసిన గాంధీనగర్ పోలీసులు శుక్రవారం వారాసిగూడలో నిందితులను పట్టుకుని వారి నుంచి దొంగిలించిన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
మహిళను కాపాడిన షీ టీం
తాను ఆపదలో ఉన్నానని ఒక మహిళ చేసిన టెలిఫోన్ కాల్‌పై స్పందించిన షీ టీం నిందితుడిని పట్టుకుని ఆమెను కాపాడింది. ఇందుకు సంబంధించి నగర అదనపు పోలీసు కమిషనర్ స్వాతిలక్రా తెలిపిని వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 11న ఖైరతాబాద్ జీ న్యూస్ ఆఫీస్ సమీపంలో తనను ఒకరు బెదిరించి సెల్‌ఫోన్ లాక్కుంటూ, కత్తితో బెదిరిస్తున్నారని ఫోన్ కాల్ రావడంతో వెంటనే వెళ్లిన షీ టీం నిందితుడిని కత్తితో సహా పట్టుకుంది.
వివరాల్లోకి వెళితే 2013 నుంచి నిందితుడు బాధితురాలికి తెలుసు. మెదక్‌లోని ఒక ప్రైవేటు పాఠశాలలో ఇద్దరు టీచర్లుగా పని చేశారు. అనంతరం ఆమె ఖైరతాబాద్‌లోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగానికి హైదరాబాద్‌కు వచ్చేసింది. గత కొంతకాలంగా తనను పెళ్లి చేసుకోవాలంటూ ఫోన్‌పై వేధించడం ప్రారంభించాడు. నిందితుడు పాల్ సుందర్‌రాజ్ ఈ నెల 11న బాధితురాలి కార్యాలయం వద్దకు వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే చంపి తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ కత్తిని చూపించి బెదిరించాడు. బాధితురాలు వెంటనే షీ టీంకు ఫిర్యాదు చేయడంతో సకాలంలో వచ్చి కత్తితో పాటు నిందితుడిని పట్టుకున్నారు. ఇందుకు షీ టీంను స్వాతిలక్రా అభినందించారు.

‘కెసిఆర్ కిట్’ అమలుకు సన్నాహాలు

హైదరాబాద్, మే 12: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గర్బిణిలకు ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ‘‘అమ్మ ఒడి’’ (కెసిఆర్ కిట్) పథకాన్ని త్వరలో అమలుపరిచేందుకు కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక సన్నాహాలు చేస్తోంది. ఈ నెలాఖరులోగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ పథకాన్ని అమలుపరిచేందుకు వీలుగా క్షేత్రస్థాయిలో ‘‘అమ్మ ఒడి’’ వెబ్‌సైట్‌లో అర్హులైన గర్బిణీల వివరాలను పొందుపరిచినట్లు రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ తెలిపారు. రాష్టస్థ్రాయిలో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ ప్రసూతి కేంద్రాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లాల వారీగా సమీక్షించిన ఆమె అవగాహన కార్యక్రమంలో భాగంగా పలు సూచనలు, సలహాలు చేశారు. రంగారెడ్డి జిల్లాలో అర్హులైన గర్భిణిలను గుర్తించి ‘‘అమ్మ ఒడి’’ వెబ్‌సైట్‌లో వారి వివరాలను పొందుపరిచినట్లు తెలిపారు. ఈ నెల చివరిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టిందని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలకు ఆదేశించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్టస్థ్రాయి ప్రత్యేక అధికారి సత్యనారాయణరెడ్డితో పాటు రాష్ట్ర, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు పాల్గొన్నారు.