రంగారెడ్డి

మారనున్న రూపురేఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మే 17: ఉప్పల్‌లోని వరంగల్ జాతీయ రహదారి విస్తరణ, అభివృద్ధితో పాటు ఎలివేటెడ్ కారిడార్‌తో పట్టణ రూపురేఖలు మారనున్నాయి. ఎన్నో ఏళ్లుగా ట్రాఫిక్ సమస్య నుంచి గట్టెక్కించడానికి రూ. 950 కోట్లతో కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో ప్రాజెక్టు పనుల దిశగా అడుగులు మొదలయ్యాయి. ఉప్పల్ రింగ్‌రోడ్డు నుంచి మేడిపల్లి నందనవనం వరకు సమారు 6.4 కిలోమీటర్ల మేరకు విస్తరణపై బుధవారం జిహెచ్‌ఎంసి ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలో స్థల యజమానులు, వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులతో స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ నిర్వహించిన తొలి అవగాహన సమావేశం హర్షధ్వానాల మధ్య ముగిసింది. మొత్తం 950 కోట్ల ప్రాజెక్టులో భూసేకరణకే 450 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉందన్నారు. స్థల యజమానులకు కొత్త భూసేకరణ చట్ట ప్రకారం న్యాయం చేసేందుకు హైలెవల్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రభాకర్ పేర్కొన్నారు. రహదారి విస్తరణలో స్థలం, ఇళ్లు కోల్పోయిన యజమానులకు భూమికి భూమి లేదా, నష్టపరిహారం ఏవిదంగా కోరుకుంటే వారికి న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. షాపులు పూర్తిగా పోతే కోరుకున్న ప్రకారం వారికి పట్టణంలో నిర్మిస్తున్న మోడల్ మార్కెట్‌లో మడిగెలు కేటాయించగలమన్నారు. విస్తరణలో నష్టం జరిగిన ప్రజలకు వెనుక నిర్మించుకునే ఇంటి యజమానులకు విధించే పన్నులను మినహాయింపు అమలుకు సహకరిస్తానన్నారు. ఇప్పటి వరకు నిర్ణయించిన ప్రకారమే 150 అడుగులు మాత్రమే విస్తరణ జరుగుతుందని, ఈ విషయంలో ప్రజలు ఎలాంటి అనుమానం వద్దని హితవుపలికారు. కారిడార్ నిర్మాణంతో వ్యాపారంలో ఎలాంటి నష్టం జరుగదని, అభివృద్ధి పధం వైపు ఉప్పల్ దూసుకెళ్తుందని వివరించారు. ఇప్పటికే వ్యాపారాలు దెబ్బతిని నష్టపోయామని, రహదారి విస్తరణతో నష్టపరిహారం సకాలంలో అందజేయాలని, భూమికి భూమి లేదా, హెచ్‌ఎండిఏ, బైపాస్ రహదారిలో కమర్షియల్ స్థలాన్ని సకాలంలో కేటాయించాలని పలువురు స్థల యజమానులు కోరారు. సమావేశంలో ఐఎఏస్ అధికారి రవీందర్ పాల్గొన్నారు.
కారిడార్ వద్దు..బైపాస్ ముద్దు
ఉప్పల్ పట్టణంలో ఎలివేటెడ్ కారిడార్ (స్కైవే) వద్దని బైపాస్ రహదారి ముద్దని పలువురు భవన యజమానులు అంటున్నారు. ఇప్పటి వరకు నిర్ణయించిన ప్రతిపాదనల ప్రకారం 150 అడుగుల వరకు విస్తరణ చేపట్టి బైపాస్ రహదారిని అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. నగరంలో ఇప్పటి వరకు లాలాపేట, తార్నాక, నారాయణగూడలోనిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జిల వల్ల వ్యాపారాలు దెబ్బతిని వీధిన పడ్డారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కారిడార్ నిర్మాణానికి స్వస్తిపలికి విస్తరణ, బైపాస్‌తో పాటు హెచ్‌ఎండిఏలో వంద అడుగుల రహదారిని అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరారు.