హైదరాబాద్

‘ఒంటరి’ మహిళలకు కొండంత అండ పింఛన్ల పంపిణీకి శరవేగంగా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: తెలంగాణ రాష్ట్రంలో వివిధ రకాల పింఛన్ల పంపిణీ చేస్తున్న ప్రభుత్వం ‘ఒంటరి మహిళ’ను వదిలేసిందన్న ఆరోపణలకు స్వస్తి పలికేందుకు రంగారెడ్డి జిల్లాలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ చర్యలు ముమ్మరం చేసింది. జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు ఆదేశాల మేరకు రోజువారీ సమీక్షలతో వచ్చిన దరఖాస్తులను వచ్చినట్టుగానే క్షేత్రస్థాయిలో శరవేగంగా విచారణ జరిపించి నివేదికలను తెప్పించుకుంటున్న అధికారులు వారికి ఆర్థిక సహాయం అందించేందుకు సిపార్సులు చేస్తున్నారు. ప్రస్తుతం అమలవుతున్న వితంతు, వృద్ధాప్య పింఛన్లకు అదనంగా ఈ పింఛన్లను జోడిచేసేందుకు చర్యలు ముమ్మరం చేశారు. రంగారెడ్డి జిల్లాలో మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న ‘ఒంటరి మహిళ’కు పింఛను పంపిణీ చేసేందుకు క్షేత్రస్థాయి విచారణలను ముమ్మరం చేశారు. రంగారెడ్డి జిల్లాలో 6260 దరఖాస్తులను స్వీకరించిన రెవెన్యూ యంత్రాంగం 4601 దరఖాస్తులను పరిశీలించి అందులో 4035 మందిని అర్హులుగా గుర్తించి సిపార్సు చేశారు. వీటిలో 3816 దరఖాస్తులు గ్రామీణ ప్రాంతాల నుండి స్వీకరించగా, 2444 దరఖాస్తులను పట్టణ ప్రాంతాల నుండి స్వీకరించారు. 548 దరఖాస్తులను పరిశీలించి అనర్హులుగా నిర్దారించారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి పింఛన్లు అందని వితంతువులు కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతో యధావిధిగా క్షేత్రస్థాయి విచారణ జరిపి, సదరు దరఖాస్తుల వివరాలను కూడా జిల్లా యంత్రాంగానికి నివేదిస్తున్నారు. ఈ క్రమంలో ఒంటరి మహిళలతోపాటు ఇప్పటివరకు ఎటువంటి లబ్ది పొందని అర్హులైన వితంతువులు, వృద్ధులకు కూడా పింఛన్లు అందే అవకాశం కనిపిస్తోంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 21 తుది గడువుగా జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు నిర్ణయించడంతోపాటు ఎప్పటికప్పుడు విచారణ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
‘కెసిఆర్ కిట్’ అమలుకు చర్యలు
‘కెసిఆర్ కిట్’ (అమ్మ ఒడి) పథకం ద్వారా గర్భీణీలకు అందించే పారితోషికంతోపాటు ఈ పథకం అమలులో అధికారుల బాధ్యతలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు వైద్యాధికారులకు సూచించారు. ఈ పథకం అమలు గురించి గురువారం ఆయన కలెక్టరేట్‌లో సమీక్షిస్తూ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఐటి నిపుణుల చేతకూడా సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన అంశాలను అధికారులకు వివరించారు. ‘అమ్మ ఒడి’ పథకం పకడ్బంధీగా నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాను ముందుంచాలని ఆయన వైద్యాధికారులను కోరారు.
ఓఆర్‌ఆర్‌పై
కారు దగ్ధం
హయత్‌నగర్, మే 18: విజయవాడ జాతీయ రహదారి పెద్దఅంబర్‌పేట్ ఔటర్‌రింగ్‌రోడ్డుపై గురువారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు కారు దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తం అయి కారులోని ప్రయాణికులను కిందకు దింపడంతో ప్రాణాపాయం తప్పింది. వివరాలోకి వెళ్తే.. (ఏపి29బిఎ0123) కారులో ఐదుగురు పెద్దఅంబర్‌పేట్ వైపు వస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొహెడ గ్రామం వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే తేరుకున్న డ్రైవర్ కారును పక్కన ఆపి అందులో ఉన్న వారిని కిందకు దింపాడు. విషయం తెలుసుకున్న ఫైర్‌సిబ్బంది మంటలను అర్పివేశారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైనట్లు హయత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ నరేందర్‌గౌడ్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.