హైదరాబాద్

సృజనాత్మకతతో విధులు నిర్వర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: జిహెచ్‌ఎంసి సిబ్బంది, ఉద్యోగులు నిరంతర విధి నిర్వాహణలో వినూత్నమైన ఆలోచనలతో సమర్థవంతమైన సేవలందించేందుకు వీలుగా సృజనాత్మకతతో విధులు నిర్వర్తించాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ నగరాన్ని ఉత్తమ జీవన ప్రమాణాలు కల్గిన నగరంగా తీర్చిదిద్దేందుకు జిహెచ్‌ఎంసి డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు, టౌన్‌ప్లానింగ్ అధికారులకు నిర్వహించిన రెండురోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నేడు జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి అధికారికి తమ విధులు, బాధ్యతల పట్ల పునశ్చరణతో పాటు ఆయా రంగాల్లో వస్తున్న ఆధునిక మార్పుల వల్ల అప్‌డేట్ కావల్సిన అవసరముందని సూచించారు. నగర సమస్యల పరిష్కారంతో పాటు సిటీని పరిశుభ్రంగా ఉంచటం తదితర పనుల్లో క్షణం కూడా తీరికలేని మున్సిపల్ అధికారులకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను మరింత మెరుగైన సేవలందించేందుకు దోహదపడుతాయన్నారు.
ప్రతి ఒక్క అధికారి ఒక్కో ప్రత్యేకత కల్గి ఉంటాడని, తన విధులు, బాధ్యతలను నిర్వర్తించటంలో ఆయా ప్రత్యేకతల ద్వారా ఉత్తమ సేవలందిస్తారని, ఈ ప్రత్యేకతలను వెలికి తీసి వారిని ప్రోత్సహించేందుకే ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడుతాయని కమిషనర్ అభిప్రాయపడ్డారు. రెవెన్యూ, పోలీస్, వాటర్ వర్క్స్ తదితర శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని ఆయన సూచించారు. అధికార దర్పంతో సమస్యలకు పరిష్కారం లభించదని, సమైఖ్య శక్తిద్వారానే ఎంత కఠిన సమస్యనైనా పరిష్కరించుకోవచ్చునని ఆయన స్పష్టం చేశారు. జిహెచ్‌ఎంసి అంటే మినీ రాష్టమ్రని, ఇందులో ఉన్న భిన్న విభాగాల మధ్య సమగ్ర అవగాహన సమన్వయంతోనే నగర వాసులకు మెరుగైన సేవలందించటం సాధ్యమవుతోందన్నారు. జిహెచ్‌ఎంసి లాంటి అతి పెద్ద స్థానిక సంస్థలో నిరంతర సమాచార మార్పిడి, మోటేషన్, పర్స్యువేషన్ అవసరమని కమిషనర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగరాన్ని ఉత్తమ నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దేందుకు వృత్తిపరమైన నైపుణ్యాల పెంపు అనే అంశంపై వర్క్‌షాప్ నిర్వహించిన ప్రముఖ శిక్షకులైన శేఖర్ అగర్వాల్ పలు ఉదాహరణలతో వివరించారు.
నిరంతర అధ్యయనం, సమాచార మార్పిడి ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతోందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు ఏ విధంగా తాము విజయం సాధించారన్న విషయాలపై ఉదాహరణలతో వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమం శనివారం కూడా కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.