హైదరాబాద్

వైభవంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర పర్యాటక, గిరిజన సంక్షేమ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి చందూలాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడు ఆయన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సలహాదారులు రమణాచారి, రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీ బి. వెంకటేశంతో కలిసి జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కలిసికట్టుగా గొప్ప పండుగలా నిర్వహించాలని ఆయన సూచించారు. పాఠశాల విద్యార్థులతో ఊరేగింపులు, అమరవీరుల సంస్మరణ, ప్రతి కార్యాలయంలో జెండా ఎగురవేసి వేడుకలను గ్రామ, మండల, జిల్లా, రాష్టస్థ్రాయిల్లో ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ అర్హులైన లబ్ధిదారులకు చేరేలా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా జిల్లాల్లో వివిధ రంగాల్లో విశిష్ఠ సేవలందించిన వారికి జిల్లా స్థాయి అవార్డులతో సత్కరించాలని, ఇందుకు కావల్సిన కార్యక్రమం రూపకల్పన చేయాలని కలెక్టర్లకు సూచించారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన నేపథ్యంలో ఈ సారి జిల్లా స్థాయి అవార్డలను 25 నుంచి 10కి కుదించినట్లు ఆయన తెలిపారు. అవార్డులు ఇవ్వాల్సిన పది రంగాల వివరాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు. కొత్త జిల్లాల్లో అమరవీరుల స్థూపాలను ఏర్పాటు చేసి నివాళులర్పించిన తర్వాత జెండా ఎగురవేసి వేడుకలను ప్రారంభించుకోవాలని ఆయన సూచించారు. కైట్ ఫెస్టివల్, ప్రపంచ తెలుగు మహాసభల నిర్వాహణపై కూడా తగిన సూచనలు, సలహాలు జారీ చేస్తామని మంత్రి వివరించారు. వృద్ధ కళకారుల పన్షన్ మంజూరీ దరఖాస్తులను జూన్ 24లోపు శాఖకు సమర్పించాలని లేని పక్షంలో ఆ జిల్లా నిధులను ఇతర జిల్లాలకు బదిలీ చేయటం జరుగుతుందని వెల్లడించారు. గత సంవత్సరం మంజూరైన నిధులకు యుటిలైజేషన్ సర్ట్ఫికెట్స్ వెంటనే సమర్పించాల్సిందిగా సూచించారు. ఈ సమీక్షలో హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వ సూచనలను అనుసరించి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కార్యచరణను సిద్దం చేస్తున్నామని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో సమాచార శాఖ అసిస్టెంటు డైరెక్టర్ రమాదేవి, సంబంధిత సెక్షన్ అధికారి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.