హైదరాబాద్

చేయూత ... నగరంలో ఒంటరి మహిళలు 6585 మంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: నా అన్నవారెవరు లేక ఒంటరి జీవితాన్ని గడుపుతున్న మహిళలను గుర్తించి, వారికి ఆర్థిక చేయూతనిచ్చే దిశగా అధికార యంత్రాంగం ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఒంటరి మహిళలకు సైతం ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత జిల్లాలోని మొత్తం 16 మండలాల్లో వేల సంఖ్యలో దరఖాస్తులొచ్చాయి. ఈ నెల 21వ తేదీ వరకు మొత్తం మండలాల్లో కలిపి సుమారు 6585 మంది ఒంటరి మహిళలు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు పెట్టుకోగా, వీటిలో అధికారులు 4549 దరఖాస్తుల వెరిఫికేషన్ కూడా పూర్తిచేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు మీ సేవా కేంద్రాల ద్వారా 4225 దరఖాస్తులు రాగా, మిగిలిన 2360 మంది ఒంటరి మహిళలు తమ దరఖాస్తులను మ్యానువల్‌గా మండలాఫీసుల్లో సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో దాదాపు 671 మంది అత్యధికంగా ఒంటరి మహిళలు మారెడ్‌పల్లి మండలంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత సంఖ్యగా దాదాపు 651 మంది ఆసిఫ్‌నగర్‌లో, 626 మంది బహద్దూర్‌పురా మండలంలో ఉండగా, అన్ని మండలాల కన్నా తక్కువ మంది 89 మంది అమీర్‌పేట మండలంలో ఉన్నట్లు అధికారులకు అందిన దరఖాస్తుల ద్వారా తెలుస్తోంది. వీటిలో అధికారులు అన్ని మండలాల్లో కలిపి ఇప్పటివరకు 4549 దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తి చేసినట్లు, మిగిలిన 2360 దరఖాస్తుల విచారణను కూడా త్వరలోనే పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. జిల్లా పరిధిలోని 16మండలాల పరిధిలో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న ఒంటరి మహిళల వివరాలను అన్ని మండలాల తహసిల్దార్లు ఈ నెల 25వ తేదీలోపు అప్‌లోడ్ చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం. ప్రశాంతి ఆదేశించారు. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులకు సంబంధించి సదరు మహిళకు సంబంధించి క్షేత్ర స్థాయిలో నెలకొన్న పరిస్థితులను విచారించాలని ఆమె అధికారులను ఆదేశించారు.