హైదరాబాద్

చురుకుగా సాగుతున్న జలభాగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: మహానగరంలో భూగర్భ జలాలను పెంపొందించేందుకు జలమండలి చేపట్టిన జలభాగ్యం కార్యక్రమం చరుకుగా సాగుతోంది. ఈ కార్యక్రమం కింద జలమండలి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇంకుడు గుంతల కార్యక్రమ తీరుపై జలమండలి రెవెన్యూ చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్. ఆనంద్ స్వరూప్ సమీక్షించారు. సోమవారం జలమండలి బోర్డు కార్యక్రమంలో జలభాగ్య కార్యక్రమ నిర్వాహణలో భాగస్వామ్యమైన నాలుగు స్వచ్చంద సంస్థలతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా జలభాగ్యం కార్యక్రమంలో భాగంగా విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో అవగాహన కల్పించిన తీరును స్వచ్చంద సంస్థల ప్రతినిధులను అడిగి తెల్సుకున్నారు. ఈ ఎన్జీవోలు ఇప్పటి వరకు ఔటర్ రింగురోడ్డు పరిధిలోని 265 నివాసేతర సంస్థలను కలిసి వారికి ఇంకుడు గుంతల ప్రాముఖ్యమైన అవగాహన కల్పించినట్లు, ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసేందుకు వారు ముందుకొచ్చినట్లు వివరించారు. ముఖ్యంగా ఇంకుడు గుంతల ఏర్పాటుకు సంబంధించి జలమండలి ఆర్థికంగా అందిస్తున్న సహాయంతో విస్త్రృతంగా ప్రచారం, అవగాహనను కల్పించాలని సిజిఎం సూచించారు. రిప్పటికే 163 సంస్థల్లో ఇంకుడు గుంతలు ఉండగా, 49 సంస్థలు నూతనంగా వీటిని నిర్మించుకునేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు. ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకునేందుకు స్వచ్చందంగా ముందుకొచ్చే సంస్థలకు జలమండలి అన్ని విధాలుగా సహకారం అందిస్తోందని సిజిఎం స్పష్టం చేశారు. ఇంకుడు గుంతలను నిర్మించేందుకయ్యే వ్యయంలో 25 శాతాన్ని ప్రోత్సాహాకంగా చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో జలమండలి సింగిల్ విండో జనరల్ మేనేజర్ సీతారాం, ఇంకుడు గుంతల కార్యక్రమ ప్రత్యేకాధికారి జె. సత్యనారాయణతోపాటు మారీ, ప్రకృతి, వేవ్స్, స్మారణ్ ఎన్జీవోలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.