హైదరాబాద్

స్వచ్ఛత పెంచు ..పురస్కారం పొందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 29: స్వచ్చ్భారత్ సాధన కోసం ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు నగరాన్ని స్వచ్చ హైదరాబాద్‌గా తీర్చిదిద్దేందుకు జిహెచ్‌ఎంసి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. స్వచ్ఛ్భారత్ మిషన్ దేశవ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన స్వచ్చ సర్వేక్షణ్‌లో 22వ స్థానం దక్కించుకున్న స్పూర్తితో జిహెచ్‌ఎంసి పరిధిలోని అన్ని సర్కిళ్లలో స్వచ్చతను పెంపొందించాలని నిర్ణయించింది. ఇందుకు గాను నగరంలోని 30 సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు ఇప్పటివరకు తమ పరిధిలో మెరుగైన పారిశుద్ధ్య, బహిరంగ మల,మూత్ర విసర్జన నివారణ కోసం, అలాగే ఎక్కడబడితే అక్కడ చెత్త వేయటాన్ని నివారించేందుకు చేపట్టిన పలు చర్యలతో మొత్తం 51 అంశాల్లో చేపటిట్న పలు కార్యక్రమాలతో కూడిన నివేదికను వచ్చే నెల 2వ తేదీలోపు కమిషనర్‌కు సమర్పించాలని అధికారులు సర్కిళ్లకు సూచించారు. మొత్తం 500 మార్కులకు సమర్పించిన అంశాల్లో మున్సిపల్ వ్యర్థాలను శాతం సేకరించటం, అలాగే చెత్తను తడి,పొడిగా సేకరిస్తున్న విధానం, ఈ దిశగా సాధించిన పురోగతి, ప్రజల్లో పెంచిన అవగాహన రవాణాకు సంబంధించిన అంశాలను సమర్పించాల్సి ఉంటుందని అధికారులు సూచించారు. పైన పేర్కొన్న వివిధ రకాల 18 అంశాలకు సంబంధించి 145 మార్కులు కేటాయించగా, భద్రత, నగరవాసుల ప్రాతినిధ్యం విభాగంలో 17 అంశాలకు సంబంధించి 150 మార్కులు, రవాణా, పారిశుద్ద్య కార్యక్రమాలను సమర్థవంతంగా పర్యవేక్షించటం అనే విభాంగలో 9 ప్రధానంశాలకు సంబంధించి 140 మార్కులను కేటాయించారు. అలాగే పబ్లిక్ టాయిలెట్ల ఏర్పాటు నిర్వాహణ విభాగంలో 7 అంశాలను సూచించి 65 మార్కులు నిర్థారించారు. గ్రేటర్ పరిధిలో పారిశుద్ద్య కార్యక్రమాలను మరింత మెరుగ్గా నిర్వహించటంలో భాగంగా వివిధ సర్కిళ్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీని విధించడానికి పారిశుద్ద్య కార్యక్రమాలను మరింత మెరుగ్గా నిర్వహించటంలో భాగంగా ప్రత్యేక పురస్కారాలను అందించాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ నిర్వహించిన స్వచ్చ సర్వేక్షణ్‌లో మెట్రో నగరాల్లో ప్రథమ స్తానంలో నిలవడటం, మొత్తంలో సర్వేలో 22వ స్థానం దక్కటంతో ఈ రకమైన ఆరోగ్యకరమైన పోటీనీ కొనసాగించేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. 500 మార్కులకు సంబంధించి డిప్యూటీ కమిషనర్ల నాలుగు అంశాలలో సూచించిన 51 ప్రమాణికాలకు సంబంధించి స్వీయ నిర్థారణ నివేదికను జూన్ 2వ తేదీన జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వచ్చ సర్కిల్‌ను ఎంపిక చేసి ప్రత్యేక పురస్కారాలను అందజేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు.