హైదరాబాద్

3డి పెయింటింగ్‌లతో కొత్త కళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 29: మహానగరంలో ఎక్కడబడితే అక్కడ కళావిహీనంగా కన్పించే పలు భవనాలు, ప్రహరీగోడలకు ఇప్పటికే జెఎన్‌టియు విద్యార్థులకే ఆకర్షణీయమైన చిత్రలేఖనాలు వేసిన జిహెచ్‌ఎంసి నగర వీధుల శోభను మరింత రెట్టింపు చేసేందుకు మరో ప్రయత్నం చేస్తోంది. కళ్లకద్దినట్టు వాస్తవానికి దగ్గరా కన్పించే త్రిడి పెయింటింగ్‌లను ఏర్పాటు చేయనుంది. కార్పొరేషన్‌పై పైసా ఖర్చు లేకుండా ఏర్పాటు చేయనున్న ఈ పెయింటింగ్‌లకు అయ్యే వ్యయం మొత్తాన్ని వివిధ కంపెనీల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సమకూర్చుకునేందుకు కూడా జిహెచ్‌ఎంసి సిద్దమైంది. ఈ 3డి చిత్రాలను సైతం పెయింటింగ్‌తో ఏర్పాటు చేస్తున్నా, చూసేవారికి ఎంతో ఆకర్షణీయంగా కన్పించనుండటంతో ఇలాంటి అరుదైన పెయింటింగ్‌లను నగరంలోని వివిధ ప్రాంతాల్లో వేయించేందుకు జిహెచ్‌ఎంసి సిద్ధమైంది.
ముఖ్యంగా ట్యాంక్‌బండ్‌పై ఉన్న బతుకమ్మ ఘాట్ వద్ద మహిళలు బతుకమ్మను ఎత్తుకుని వస్తున్నట్లు, ప్రవహిస్తున్న నీటిలో బతుకమ్మలను వదులుతున్నట్లు ఈ త్రిడి పెయింటింగ్‌లను ఏర్పాటు చేసేందుకు బల్దియా సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పనులు కూడా ప్రారంభమయ్యాయి. బతుకమ్మఘాట్ మెట్లపై వేస్తున్న ఈ చిత్రంలో పై నుంచి జలపాతం కిందకు ప్రవహిస్తూ వస్తున్నట్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ పెయింటింగ్‌ను వచ్చే నెల 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం లోపు పూర్తి చేసి, అదే రోజు నుంచి సామాన్య ప్రజల సందర్శించేలా ఏర్పాటు చేయనున్నారు. అంతేగాక, ఈరకమైన పెయింటింగ్‌లను వేయించేందుకు పలు ప్రధాన రహదార్లను కూడా గుర్తించినట్లు జిహెచ్‌ఎంసి అధికారులు తెలిపారు.
ఇప్పటికే ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌పై తెలంగాణ సంస్కృతి సంప్రదాయలా, ప్రజల జీవనశైలి, నగర చారిత్రక వైభవానికి సజీవ సాక్షాలుగా మిగిలిన పలు చారిత్రక కట్టడాలతో కూడిన పెయింటింగ్‌లను ఏర్పాటు చేశారు. ఇవి సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వేసిన చిత్రంలో అంశం అక్కడున్నట్లు భ్రమను కల్గించే ఈ త్రిడి పెయింటింగ్‌లను నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో వేయించనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.