హైదరాబాద్

అర్హులనే ఎంపిక చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 29: ఒంటరి మహిళల పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను బాధ్యతాయుతంగా పరిశీలించి అసలైన అర్హులనే ఎంపిక చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె కలెక్టరేట్‌లో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి ఇళ్లు, పెన్షన్, ఉద్యోగాలు తదితర అంశాలకు సంబంధించిన వినతిపత్రాలు, ఆర్జీలను స్వీకరించారు. సికిందరాబాద్ మారేడ్‌పల్లికి చెందిన మహ్మద్ నాజీర్ ఉల్లాఖాన్(67) అనే వృద్దుడు తనకు ఏ ఆధారం లేనందున వృద్దాప్య పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. ఇందుకు స్పందించిన జేసి సంబంధిత తహశీల్దార్ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే సికిందరాబాద్ రసూల్‌పురా ప్రాంతానికి చెందిన జి. సరిత టెన్త్ వరకు చదువుకున్నానని, కొన్ని కారణాల వద్ద భర్తకు దూరంగా ఉంటున్నానని, తనకు ఇద్దరు పిల్లలున్నారని, తనకు ఆర్థికంగా ఎలాంటి ఆధారం లేనందున అంగన్‌వాడి టీచరు పోస్టును ఇప్పించాలని వినతిపత్రం సమర్పించారు. ఇందుకు స్పందించిన జేసి ఆమె ఆర్జీని పరిశీలించాలని సంబంధిత అధికారులకు అప్పగించారు.
మల్లేపల్లికి చెందిన పి. వెంకటేశ్ ప్రభుత్వం అమలు చేస్తన్న పథకాల్లో 2015-16 సంవత్సరానికి బిసి కార్పొరేషన్ ద్వారా రుణ మంజూరీ చేయటం జరిగందని, తనకు వెంటనే సబ్సిడీ మంజూరు చేయాలని వినతి సమర్పించారు. బిసి కార్పొరేషన్ అధికారులు విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని జేసి ఆదేశించారు. అంతేగాక, మీ కోసం కార్యక్రమానికి వచ్చిన వారందరికి హైదరాబాద్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ చేశారు. ఇక నుంచి ప్రతి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందని రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ మామిడి భీమ్‌రెడ్డి తెలిపారు. అనంతరం జేసి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల్లో ఒంటరి మహిళల పెన్షన్ దరఖాస్తుల పరిశీలనను వెంటనే పూర్తి చేసి, ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను కలెక్టర్ ఆమోదానికి సమర్పించాలని తహసిల్దార్లను ఆదేశించారు. జూన్ 3న నిర్వహించనున్న కెసిఆర్ కిట్ల పంపిణీ కార్యఅకమానికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని కూడా ఆమె జిల్లా వైద్యారోగ్యశాఖాధికారులను ఆదేశించారు.