హైదరాబాద్

నేటి జిహెచ్‌ఎంసి కౌన్సిల్ భేటీ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగర పాలక సంస్థ కొత్త పాలక మండలి మొట్టమొదటి సమావేశం వాయిదా పడింది. ఇదివరకే మేయర్ బొంతు రామ్మోహన్ చేసిన ప్రకటన ప్రకారం శనివారం ఉదయం పదకొండు గంటల నుంచి ప్రారంభం కావల్సిన కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు మేయర్ రామ్మోహన్ తెలిపారు. ఉప రాష్టప్రతి హమీద్ అన్సారి నగర పర్యటన నేపథ్యంలో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆయన వివరించారు. ఉదయం పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు సమావేశం జరిగే అవకాశమున్నందున తక్కువ సమయంలో ఎక్కువ అంశాలపై చర్చ జరిగే అవకాశం లేకపోవటంతో వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా వేసవి కాలం ముంచుకొస్తున్న నీటి ఎద్దడిపై ముందు జాగ్రత్తగా చేపట్టాల్సిన చర్యలపై కౌన్సిల్‌లో చర్చ జరిగే అవకాశం లేనందున పలువురు కార్పొరేటర్ల అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు ఉప రాష్టప్రతికి ఆహ్వానం పలకనున్నందున, ఆశించినంత సేపు కౌన్సిల్ సమావేశం జరిగే అవకాశాల్లేనందున వాయిదా తప్పలేదని వివరించారు. జిహెచ్‌ఎంసి కౌన్సిల్ సమావేశాన్ని తిరిగి నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు మేయర్ వెల్లడించారు. మేయర్ అందుబాటులో లేకపోయినా డిప్యూటీ మేయర్ కౌన్సిల్ సమావేశాన్ని నడిపే అవకాశమున్నా, ఎక్కువ అంశాలు చర్చించేందుకు సమయం లేకపోవటం వల్లే సమావేశాన్ని వాయిదా వేశారని చెప్పవచ్చు.
మొట్టమొదటి సారిగా..
ఉప రాష్టప్రతి హమీద్ అన్సారి నగర పర్యటన కారణంగా మేయర్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు. మొట్టమొదటి సారిగా నగర ప్రథమ పౌరుడి హోదాలో బొంతు రామ్మోహన్ ఉప రాష్టప్రతికి శనివారం సాయంత్రం నాలుగు గంటలకు బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలకనున్నారు. అంతేగాక, ఉప రాష్టప్రతి రాకను ఆహ్వానిస్తూ జిహెచ్‌ఎంసి నగరంలోని పలు ముఖ్యమైన ప్రాంతాల్లో హోర్డింగ్‌లను కూడా ఏర్పాటు చేసింది.