హైదరాబాద్

సులభతరమైన పాలనా సేవల్లో గ్రేటర్ ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జూన్ 18: నగర ప్రజలకు సులభతరమైన పాలన సేవలు (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో బల్దియా ముందజలో దూసుకుపోతుంది. దేశంలోని వివిధ మెట్రో నగరాలతో పోల్చితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రజలకు అందుతున్న సేవలపై కేంద్రం సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. సాంకేతికతను వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోంది. ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక విధానాలను గ్రేటర్‌లో అలవర్చుకోవం ఎలా? అవి ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తాయి అనే అంశాలపై కమిషనర్ ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి అధికారులతో విడివిడిగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమావేశాలకు బల్దియా సేవల్లో లోపాలను ఎత్తిచూపే సంస్థల ప్రతినిధులను సైతం ఆహ్వానిస్తున్నారు. ఆయా సమావేశాల్లో వారు లేవనెత్తే అంశాలను, సూచనలను పరిగణనలోనికి తీసుకొని మార్పులు, చేర్పులకు శ్రీకారం చుడుతున్నారు. బయోమెట్రిక్‌తో కార్మికుల హాజరు నమోదు చేయడం, జిహెచ్‌ఎంసిలో చెత్త తరలింపుకు వినియోగిస్తున్న వాహనాలకు జిపిఎస్ యంత్రాలను బిగించి, కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయడం వంటి చర్యలతో సేవల్లో పారదర్శకత పెరుగుతుంది. వీటితో పాటు జిహెచ్‌ఎంసి ఆస్తులను ప్రత్యేకంగా సర్వే చేయించి మ్యాపింగ్ పూర్తిచేయాలని కమిషనర్ ఇటీవలే ఆదేశించారు. ఆస్తి పన్ను వివరాలు, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ డేటాకు అనుసంధానించడం, లైసెన్సుల జారీలో పారదర్శకంగా పెంచడంపై దృష్టిసారించారు. భవన నిర్మాణ అనుమతులన్నింటినీ ఆన్‌లైన్‌లోనే జరిగేలా చూస్తున్నారు. వివిధ రకాల సేవల కోసం దరఖాస్తు చేసుకుంటే ఏ స్థాయిలో ఉన్నయో తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం బల్దియ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను ఆధునీకరించనున్నారు. నిరంతరం లోపాలను సరి చేసుకుంటూ పారదర్శకతను పెంచేందుకు జిహెచ్‌ఎంసి ప్రయత్నిస్తుండటంతో పౌరసేవలు సులభంగా మారుతున్నాయి.
రాజకీయాలను శాసిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలు
కాచిగూడ, జూన్ 18: కార్పొరేట్ విద్యాసంస్థలే ప్రైవేటు విద్యారంగంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయని, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నాయని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ వామపక్ష పార్టీలు - ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ‘కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలను నియంత్రించాలి’ అనే అంశంపై రాష్ట్ర విద్యా సదస్సు ఆదివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, రాజకీయ విశే్లషకుడు ప్రొఫెసర్ హరగోపాల్, పాల్గొన్నారు. విద్యారంగంలో త్రీవమైన అనమానతలు ఏర్పాడుతున్నాయని వాటిని నియంత్రించాలంటే, కార్పొరేట్ స్కూళ్లను నియంత్రించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. విద్యావ్యాపారాన్ని నియంత్రించే విధంగా చట్టాన్ని తీసుకురావాని పేర్కొన్నారు. ప్రైవేటు స్కూల్స్ పుస్తకాలు, యూనిఫామ్ తదితర వాటిని అధిక రేట్లతో విక్రయిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యలు కల్పించి ప్రొత్సహించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో నియమాకాలు జరగలేదని వాటిని వెంటనే భర్తీ చేయలని అన్నారు. అధిక ఫీజులతో దోపిడీ చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాను వ్యాపారంగా చేసి పేద, మధ్య తరగతి ప్రజలకు విద్యానందకుండా దూరం చేస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు నాగటి నారాయణ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆదిరెడ్డి పాల్గొన్నారు.