హైదరాబాద్

ప్రజావాణి విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: ప్రజావాణికి వచ్చే విజ్ఞప్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన విజ్ఞప్తులను వెంటనే పరిష్కరించి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఇళ్ల కేటాయింపులు, పెన్షన్‌లు, భూ సమస్యలు, రుణ మంజూరు, రుణమాఫీ, ఆహార భద్రత కార్డు తదితర అంశాలపై సుమారు 51 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును పర్యవేక్షించడానికి సిజిజి.. జిల్లాలవారీగా డ్యాష్ బోర్డ్‌ని రూపొందిస్తుందని, జిల్లా అధికారులు వారి శాఖలు అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన నియమ నిబంధనల సమాచారాన్ని నిర్ణీత నివేదికలో సమర్పించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ బుధవారం ఉదయం 10.30 గంటలకు సిజిజి అధికారులతో కలిసి సమావేశం నిర్వహిస్తారని, దీనికి అధికారులందరూ తప్పనిసరిగా వారి పథకాలకు సంబంధించిన సమాచారంతో (వెబ్‌సైట్ వివరాలతో సహా) హాజరుకావాలని అన్నారు. ప్రజావాణిలో జిల్లా రెవెన్యూ అధికారి భవాని శంకర్, స్పెషల్ డిప్యూటీ తహశీల్దార్ స్వర్ణలత పాల్గొన్నారు.
అనంతగిరిలో నంది విగ్రహం ఏర్పాటు
*జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీత వెల్లడి

వికారాబాద్, జూన్ 19: వికారాబాద్ జిల్లా అనంతగిరిలో మరో సందర్శనీయ స్థలం ఏర్పాటైంది. అనంతగిరి నుండి కెరెళ్లి వైపు వెళ్లే ఘాట్‌రోడ్డులో పెద్ద నంది విగ్రహాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. విగ్రహం ఏర్పాటు చేసినట్లు విషయం తెలుసుకున్న జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పి.సునీతారెడ్డి సందర్శించి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వికారాబాద్ శాసనసభ్యుడు బి.సంజీవరావు, ఎంపిపి ఎస్.్భగ్యలక్ష్మి, ధారూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు నాయక్, వికారాబాద్ జడ్పీటిసి ముత్తార్‌షరీఫ్, ధారూర్ మండల టిఆర్‌ఎస్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.శుభప్రద్ పటేల్, కొటాలగూడ సర్పంచ్ రాఘవన్ నాయక్, ధారూర్ నాయకుడు నందు, వేద పండితులు సాంబశివశర్మ, అర్చకుడు రాజులు పాల్గొన్నారు. ఓవైపు శ్రీఅనంత పద్మనాభస్వామి ఆలయం, మరోవైపు టూరిజం హోటల్, అనంతగిరి అడవి అందాలు.. భక్తులు, పర్యాటకులను కనువిందు చేస్తుండగా, నంది విగ్రహం ఏర్పాటుతో అనంతగిరికి మరో ఆభరణం వచ్చింది.