హైదరాబాద్

ఇంటింటికీ ఎల్‌ఇడి లైట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: మహానగరంలో విద్యుత్ పొదుపుకు సంబంధించి ఇప్పటికే సత్ఫలితాలు సాధించిన జిహెచ్‌ఎంసి ఇపుడు మరో వినూత్నమైన చర్యలను చేపట్టింది. నగరంలో జిహెచ్‌ఎంసి నిర్వహణ బాధ్యతలు చేపట్టిన వీది ధీపాలు, జిహెచ్‌ఎంసి కార్యాలయాల్లోనే గాక, ప్రతి ఇంట్లో కూడా విద్యుత్‌ను ఆదా చేసేందుకు నడుం బిగించింది. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఇఇఎస్‌ఎల్ సంస్థ సబ్సిడీకి విక్రయిస్తున్న ఎల్‌ఇడి లైట్లను ప్రతి ఇంట్లో వెలిగేలా చర్యలు చేపట్టింది. కొద్దిరోజుల క్రితం వరకు జిహెచ్‌ఎంసి ప్రధాన, జోన్, సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి విక్రయించిన ఎల్‌ఇడి లైట్లు, ట్యూబ్‌లైట్లు, విద్యుత్‌ను పొదుపు చేసే ఫ్యాన్లను విక్రయించిన జిహెచ్‌ఎంసి ఇపుడు ప్రతి ఇంట్లో ఎల్‌ఇడి బల్బులు వెలిగింపజేసేందుకు సిద్ధమైంది. అయితే నిన్నమొన్నటి వరకు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసిన జిహెచ్‌ఎంసి నగరంలో 24లక్షల కుటుంబాలుండగా, కేవలం నాలుగు లక్షల 20వేల లైట్లను మాత్రమే విక్రయించింది. ప్రతి ఇంట్లో ఎల్‌ఇడి లైట్లు వెలిగేలా ఇపుడు ఆ లైట్ల విక్రయం బాధ్యతలను స్వయం సహాయక బృందాలకు అప్పగించింది. స్థానిక ప్రజలతో చక్కటి పరిచయాలు, గుర్తింపు ఉండే స్వయం సహాయక బృందాలు ఎల్‌ఇడి లైట్లపై ప్రజలను అవగాహన వంతులను చేసి, వారిని ఎల్‌ఇడి లైట్లను వినియోగించి, విద్యుత్‌ను ఆదా చేసే దిశగా చైతన్యవంతులను చేయాలని ఆదేశించింది. అంతేగాక, ప్రస్తుతం రూ. 70కు విక్రయిస్తున్న ఎల్‌ఇడి లైట్లు ఒక్కొదానిపై పది శాతం అంటే ఏడు రూపాయల వరకు స్వయం సహాయక బృందాలకు కమీషన్ కూడా ఇస్తున్నట్లు జిహెచ్‌ఎంసి అధికారులు తెలిపారు. స్వయం సహాయక బృందాలు విక్రయించే లైట్ల విక్రయాలు, అందుకు సంబంధించి నగదు చెల్లింపులకు జిహెచ్‌ఎంసి బాధ్యత తీసుకుంది.
ఒక్కో లైటు విక్రయంపై ఇచ్చే పది శాతం కమీషనల్‌లో మూడు శాతం టౌన్‌లెవెల్ ఫెడరేషన్‌కు కేటాయించగా, మిగిలిన ఏడు శాతం నేరుగా స్వయం సహాయక బృందాలకు ఆదాయంగా మారనుంది. ఇందుకు సంబంధించి త్వరలోనే టిఎల్‌ఎఫ్, ఇఇఎస్‌ఎల్‌ల మధ్య ఒప్పందం కూడా కుదరనుంది. దీంతో నగరంలోని నాలుగున్నర లక్షల మహిళా సభ్యులకు ఆర్థికంగా లాభం కూడా చేకూరనుంది. ఈ రకంగా ప్రస్తుతం నగరంలోనున్న 24లక్షల కుటుంబాలకు ఒక్కోదానికి నాలుగైదు లైట్లు చొప్పున నగరంలో మొత్తం కోటి ఎల్‌ఇడి లైట్లను విక్రయింటమే జిహెచ్‌ఎంసి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లైట్ల విక్రయాన్ని ఈ నెల 21న మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించనున్నారు. ఎల్‌ఇడి లైట్లతో విద్యుత్ ఆదా పెరగటంతో పాటు మహిళా సంఘాలకు ఆర్థికంగా కొంతమేరకైనా చేయూతనివ్వవచ్చునని జిహెచ్‌ఎంసి భావిస్తోంది.