హైదరాబాద్

ఏం చేయాలో చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: నిత్యం ట్రాఫిక్ సమస్యతో సతమతమయ్యే జంటనగరవాసుల చిరకాల స్వప్నమైన మెట్రోరైలు పట్టాలెక్కే దిశగా అడుగులు వేస్తోంది. 70 కిలోమీటర్ల పొడువున మూడు కారిడార్లలో పనులు జోరుగా సాగుతున్నా, మియాపూర్ నుంచి సంజీవరెడ్డినగర్‌కాలనీ, నాగోల్ నుంచి బేగంపేట వరకు తొలి దశగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇందుకు సంబంధించి మూడు కారిడార్లలో ట్రాఫిక్ సమస్య కారణంగా సంభవిస్తున్న ప్రమాదాల నివారణే లక్ష్యంగా అధ్యయనం చేపట్టి, ట్రాఫిక్ సమస్య, ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వ విభాగాలకు చెందిన ఆరుగురు ఉన్నతాధికారులతో ఓ ప్రత్యేక కమిటీని నియమించింది. మెట్రో కారిడార్ ఏర్పాటవుతున్న ప్రాంతాల్లో సిటీ ట్రాఫిక్ పోలీసులు సూచించిన ప్రాంతాల్లో ఈ అధ్యయనం చేసి, నెలరోజుల్లో నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
ఇప్పటికే ట్రాఫిక్ సమస్య తీవ్రమైన, మెట్రో పనులు ప్రారంభమైన తర్వాత పెరిగిన ట్రాఫిక్ తీవ్రత, ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రాంతాల్లో నివారణ చర్యలు వంటి అంశాల ప్రాతిపదికన అధ్యయనం నిర్వహించి, చేపట్టాల్సిన చర్యలను నివేదించాలని ప్రభుత్వం కోరింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాంతాలు, మెట్రో రైలు కారిడార్ నిర్మాణం జరిగిన ప్రాంతాల్లో ట్రాఫిక్ పరంగా ఉన్న ప్రతికూల పరిస్థితులు, ప్రమాదాలు జరిగేందుకు కారణాలు, వాటిని అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలను వెల్లడించాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించింది. అంతేగాక, మెట్రోవయోడక్ట్ కిందనున్న సెంట్రల్ మీడియా పరిస్థితి, పరిరక్షణకు తీసుకోవల్సిన చర్యలను కూడా వెల్లడించాలని ప్రభుత్వం కమిటీకి సూచించింది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిష్నరేట్ పరిధితో పాటు మెట్రో కారిడార్ రాచకొండ కమిష్నరేట్ పరిధిలోకి కూడా వస్తుండటంతో ఈ కమిటీ అక్కడ పోలీసు కమిషనర్‌తో సంప్రదింపులు జరిగి రోడ్డు ప్రమాద నివారణకు తీసుకోవల్సిన చర్యలను ఖరారు చేసి పంపితే, వీటిపై ఎల్ అండ్ టి నుంచి తుది నిర్ణయం తీసుకుని చర్యలు చేపట్టానున్నారు.
కమిటీలో సభ్యులు
మెట్రోరైలు అందుబాటులోకి రానున్న కారిడార్లలో ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాల నివారణ వంటి అంశాలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీలో సభ్యులు ట్రాఫిక్, రవాణా నిపుణులు డా.టి.ఎస్.రెడ్డి, హెచ్‌ఎంఆర్‌ఎల్ జనరల్ మేనేజర్(వర్క్స్) బి.ఎన్. రాజేశ్వర్, జిహెచ్‌ఎంసి ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ (టి అండ్ టి) ఎం. వెంకట్‌రెడ్డి, మెట్రోరైలు ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ వై. సూర్యపురెడ్డి, మెట్రోరైలు అదనపు డిసిపి ఎ. బాలకృష్ణలతో పాటు ట్రాఫిక్ అదనపు జాయింట్ పోలీసు కమిషనర్ ఓ ఏసిపిని నామినేట్ సభ్యుడిగా నియమించనున్నారు.