హైదరాబాద్

ఘనంగా ఎల్లమ్మ కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనత్‌నగర్, జూన్ 27: భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధికెక్కిన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అమ్మవారి కల్యాణ వేడుకలను పురస్కరించుకొని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెల్లవారుఝాము నుంచే దేవాలయానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలి రావడంతో అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాలు జనసందోహంగా మారాయి. తెల్లవారుఝాము నుంచి ప్రత్యేక అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో పూజలు నిర్వహించారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులు కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు బల్కంపేట ప్రధాన రహదారిపై మండపాన్ని ఏర్పాటు చేశారు. వివిధ రకాల పూలు, అలంకరణ సామాగ్రితో తీర్చిదిద్దిన మండపం భక్తులకు విశేషంగా ఆకట్టుకుంది. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిదాల నడుమ అమ్మవారి కల్యాణం కన్నుల పండువగా జరిగింది.
పటిష్ట బందోబస్తు
రేణుక ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులు పటిష్టబందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా భారీగా పోలీసులను మోహరించారు. సోమవారం అర్ధరాత్రి నుంచే ఆలయ పరిసర ప్రాంతాల్లో పికెటింగ్‌లను ఏర్పాటు చేసి భక్తుల రద్దీని నియంత్రించారు. దీంతో పాటు ఆలయం పరిసర ప్రాంతాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసి, ఆలయ ప్రాంగణంలో మానిటరింగ్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఓ సి ఐ స్థాయి అధికారి సిసి కెమెరాలను పర్యవేక్షిస్తూ భక్తుల రద్దీకి అనుగుణంగా వెలుపల పనిచేసే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
నేడు అమ్మవారి ఊరేగింపు
అమ్మవారి కల్యాణ ఘట్టం ముగియడంతో గురువారం సాయంత్రం అమ్మవారిని బల్కంపేటలోని పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నారు. ప్రత్యేక రథంలో అమ్మవారిని ప్రతిష్ఠింప చేసి మంత్రోచ్ఛారణల మధ్య రథాన్ని కాలనీలు, బస్తీల మీదుగా ఉరేగించి తిరిగి ఆలయానికి చేర్చడంతో కల్యాణోత్సవం ముగుస్తుంది.
మంత్రి తనయుడి వాగ్వాదం
అమ్మవారి కల్యాణం సందర్భంగా విపరీతమైన రద్దీ ఉన్న సమయంలో ఒక్కసారిగా మంత్రి పద్మారావు తనయుడు 50 మంది గుంపుతో ఒక్కసారిగా వచ్చి పోలీసులతో వాగ్వాదం చేసి మరీ గర్భగుడిలో ప్రవేశించారు. దీనిని చూసి అటు పోలీసులు, ఇటు భక్తులు తప్పుపట్టారు.