హైదరాబాద్

కొమ్మల కటింగ్ ఇక వెరీ వీజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: జిహెచ్‌ఎంసి అర్బన్ బయోడైవర్శిటీ విభాగంలో కూడా సరికొత్త ఆధునిక వాహనాలు, యంత్రాలు సమకూరాయి. ముఖ్యంగా బలమైన గాలులతో వర్షాలు కురిసినపుడు రోడ్డుపై విరిగి పడే చెట్టు కొమ్మలను కట్టింగ్ చేసి తొలగించటం ఇక సులువు కానుంది. తొలి దశగా రూ. 15 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన బ్రాంచ్ ఫ్రూనింగ్ మిషన్లను మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక ఎమ్మెల్యే డా.కె.లక్ష్మణ్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్‌తో కలిసి మంగళవారం ఇందిరాపార్కులో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వాహనాలు, యంత్రాలతో రోడ్లపై విరికిపడే కొమ్మలను, రోడ్డుకు అడ్డంగా పెరిగే కొమ్మలను ఒకే వ్యక్తి చాలా తక్కువ సమయంలో సులువుగా కట్టింగ్ చేసి తొలగించే వెసులుబాటు కల్గుతోందన్నారు. అంతేగాక, ఈ యంత్రాలతో కొమ్మలను చిన్న చిన్న ముక్కలు చేయటం, ద్వారా వాటి రవాణాకు సులభం కావటంతో పాటు సేంద్రీయ ఎరువుల తయారీకి అనువుగా ఉంటుందని వివరించారు. ప్రకృతి విపత్తుల సమయంలో రహదారులపై కూరిన చెట్లను వెంటనే తొలగించేందుకు ఎంతో ఉపయోగపడే ఇలాంటి యంత్రాలను జోన్‌కు ఒకటి చొప్పున కొనుగోలు చేయనున్నట్లు వివరించారు. హైదరాబాద్ నగరంలో హరితహారం కార్యక్రమలం భాగంగా జిహెచ్‌ఎంసి నేటి వరకు సుమరా 50లక్షల పై చిలుకు మొక్కలను నాటినట్లు, ప్రజలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. మొక్కలను నాటడమే గాక, వాటి పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నట్లు వెల్లడించారు.
ఇందులో భాగంగా పలు కంపెనీలు, వ్యాపార సంస్థల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ట్రీగార్డులను సమకూర్చుతున్నామని వివరించారు. ఇప్పటి వరకు 6వేల 325 ట్రీగార్డులను వివిధ సంస్థల నుంచి స్వీకరించినట్లు తెలిపారు. వీటిని వివిధ కాలనీలు, ప్రధాన రహదారుల వెంట నాటిన మొక్కల పరిరక్షణకు వినియోగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బయోడైవర్శిటీ విభాగం డైరెక్టర్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు.