హైదరాబాద్

ప్రత్యేక ఆకర్షణగా మెట్రో స్టేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: అడుగడుగునా ట్రాఫిక్ కష్టాలనెదుర్కొంటున్న జంట నగరవాసులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న మెట్రోరైలు పనులు మరింత వేగవంతమయ్యాయి. వచ్చే ఉగాది పండుగ రోజున, లేక రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 తేదీన రెండు కారిడార్లలో 24 కిలోమీటర్ల మెట్రోసేవలను అందుబాటులోకి తేవాలని సర్కారు భావిస్తున్న నేపథ్యంలో పనులు మమ్మరమయ్యాయి. కారిడార్ 1లోని మియాపూర్ నుంచి ఎస్‌ఆర్‌నగర్ వరకు, అలాగే కారిడార్ 3లోని నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు అందుబాటులోకి తేవాలని భావించినా, తాజాగా నిర్ణయం ప్రకారం బేగంపేట వరకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ రెండు కారిడార్లలో మెట్రో అధికారులు స్టేషన్లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కారిడార్ కన్నా స్టేషన్లలో ఎక్కువ పనులుండటంతో వాటిపై దృష్టి సారించారు. మూడు కారిడార్లలో మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు సుమారు 29 కి.మీల పొడువునా 27 స్టేషన్లతో ఏర్పాటు కానున్న కారిడార్- 1, అలాగే నాగోల్ నుంచి శిల్పారామం వరకు దాదాపు 29 కి.మీల పొడువునా మొత్తం 23 స్టేషన్లతో ఏర్పాటు చేయనున్న కారిడార్-3ల పనులు శరవేగంగా జరుగుతుండగా, సికిందరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఫలక్‌నుమా వరకు సుమారు 15 కి.మీల పొడువున 16 స్టేషన్లతో ఏర్పాటు చేయాల్సిన కారిడార్-2 పనులు ప్రస్తుతం సిబిఎస్ వరకే పరిమితమైన సంగతి తెలిసిందే! అక్కడి ఫలక్‌నుమా వరకు ఏర్పాటు చేయాల్సిన కారిడార్‌పై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవల్సి ఉంది.
ఆధునిక సౌకర్యాలతో వ్యాపార కేంద్రాలుగా..!
మెట్రోరైలు స్టేషన్లు వాణిజ్య, వ్యాపార కేంద్రాలుగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ఒక్కో స్టేషన్ చుట్టుపక్కల 500 మీటర్ల పరిధిలో మాల్స్ ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికుల్లో మహిళలు, చిన్నారులు వృద్థులకు సైతం అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉండేందుకు వీలుగా వీటిని డిజైనింగ్ చేస్తున్నారు. పనిభారంతో ప్రయాణించే వారు స్టేషన్లలోనే కూరగాయలు మొదలుకుని ఎలక్ట్రానిక్ పరికరాలను అందుబాటులో తెచ్చేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఫ్యామిలీ రిక్రియేషన్, సామాజిక కార్యక్రమాలు నిర్వహించే హబ్, ప్రజాకళలు ఉట్టిపడే ఫర్నిచర్‌తో పాటు కాలుష్యాన్ని నియంత్రించేందుకు వీలుగా బైసైకిల్ ట్రాక్స్, సీనియర్ సిటిజన్లు, చిన్నారుల కోసం ఆట వస్తువులు వంటివి ఏర్పాటు చేయనున్నారు. అమీర్‌పేట సమీపంలోని మధురానగర్‌లోని మెట్రోస్టేషన్‌లో మహిళల కోసం తరుణి మార్కెట్, యుసుఫ్‌గూడలో అందుబాటులోకి రానున్న స్టేషన్‌లో యూత్‌కు కావల్సిన అన్ని రకాల సదుపాయాలు, పరికరాలతో యూత్ స్టేషన్‌ను ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటివరకు రైతుబజార్లలోనే కూరగాయలను విక్రయించుకునే రైతులు మున్ముందు భరత్‌నగర్, సికిందరాబాద్, బోయిగూడ స్టేషన్లలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక మార్కెట్‌లలో కూడా విక్రయాలు కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నారుల కోసం ఉప్పల్, మియాపూర్ డిపోల్లో ప్రత్యేక సదుపాయాల కల్పనకై ప్రత్యేకంగా డిజైనింగ్ చేసి నిర్మిస్తున్నారు. అలాగే, కారిడార్-1లోని మియాపూర్, జెఎన్‌టియు, కెపిహెచ్‌బి కాలనీ, కూకట్‌పల్లి, బాలానగర్, మూసాపేట, భరత్‌నగర్, ఎర్రగడ్డ, ఇఎస్‌ఐ ఆస్పత్రి, సంజీవరెడ్డినగర్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, అసెంబ్లీ, గాంధీభవన్, ఉస్మానియా మెడికల్ కాలేజీ, ఎంజిబిఎస్, మలక్‌పేట, మూసారాంబాగ్, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, విక్టోరియా మెమోరియల్, ఎల్బీనగర్, కారిడార్ 2లోని జెబిఎస్, పరేడ్‌గ్రౌండ్స్, సికిందరాబాద్, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్, ఆర్టీసి క్రాస్‌రోడ్డు, నారాయణగూడ, సుల్తాన్‌బజార్, సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, శంషీర్‌గంజ్, జంగమ్మెట్, ఫలక్‌నుమా, కారిడార్ 3లోని నాగోల్, ఉప్పల్, నాగోల్, ఎన్‌జిఆర్‌ఐ, హబ్సిగూడ, తార్నాక, లాలాగూడ, మెట్టుగూడ, ప్యారడైజ్, రసూల్‌పురా, ప్రకాశ్‌నగర్, బేగంపేట, మధురానగర్, యూసుఫ్‌గూడ, రోడ్ నెం.5, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గంచెరువు, హైటెక్‌సిటీ, శిల్పారామం స్టేషన్లలో షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేస్తున్నారు.

సికింద్రాబాద్ గణపతి దేవాలయ హుండీ లెక్కింపు
బేగంపేట, సెప్టెంబర్ 12: సికింద్రాబాద్ గణపతి దేవాలయం హుండీ లెక్కింపు మంగళవారం నిర్వహించారు. ఆలయ ఇఓ నర్సింలు, దేవాలయ చైర్మన్ పిట్ల నగేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరిగింది. రెండు నెలల పదిహేను రోజులకు ఇరవై లక్షల ముప్ఫయి ఆరువేల పదమూడు రూపాయలు, 124 యుఎస్ డాలర్లు ఆదాయం వచ్చిందని ఇఓ నర్సింలు వెల్లడించారు. కార్యక్రమంలో ఇఓతోపాటు అసిస్టెంట్ కమిషనర్ వెంకటేష్, ఆలయ కమిటీ సభ్యులు ముఖేష్ యాదవ్, సురేష్, నరేందర్, ఎన్.శ్రీనివాస్, పిఎన్ శ్రీనివాస్, కస్తూరి, గోపిబాబు, నవీన్ పాల్గొన్నారు.
ఆలయ చైర్మన్‌గా నగేష్ ముదిరాజ్ ఎన్నిక
సికింద్రాబాద్ గణపతి దేవాలయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పాలకవర్గాన్ని నియమించింది. పాలకవర్గ సభ్యుడైన పిట్ల నగేష్ ముదిరాజ్‌ను చైర్మన్‌గా నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అసిస్టెంట్ కమిషనర్ వెంకటేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఆలయంలో జరిగిన కమిటీ సమావేశంలో చైర్మన్‌గా నగేష్ ముదిరాజ్‌ను ఎన్నుకున్నారు.