హైదరాబాద్

ఇంకుడు గుంతలపై అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: ఇంకుడు గుంతలతోనే భావితరాలకు భూగర్భ జలాలను అందించగలమని జలమండలి ఇంకుడు గుంతల ప్రత్యేకాధికారి జె. సత్యనారాయణ అన్నారు. మంగళవారం జలభాగ్యం కార్యక్రమంపై సీడ్ స్వచ్ఛంద సంస్థతో కలిసి మునగనూర్‌లోని ఇందిరా పబ్లిక్ స్కూల్‌లో ఆయన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంకుడు గుంతల శంకుస్థాపనతో పాటు జియోట్యాగింగ్‌ను చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఇంకుడు గుంతల నిర్మాణంలో నగరవాసులు ప్రతి ఒక్కరూ పాల్గొని, వాటిని పెంచుకోవాలన్నారు. ముఖ్యంగా విద్యాసంస్థలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ వివరించి, వారిని చైతన్యవంతులను చేయాలని సూచించారు. నగరంలో కురిసే ప్రతి వర్షపు చుక్కను ఓడిసి పట్టి, నీటి కొరతను అధిగమించాలంటే ఇంకుడు గుంతలు ఎంతో ముఖ్యమని ఆయన వివరించారు. వీటిని ఎంత అధిక సంఖ్యలో ఏర్పాటు చేసుకోగలిగితే అంత ఎక్కువ స్థాయిలో భూగర్భ జలాలు మెరుగుపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సీడ్ స్వచ్ఛంద సంస్థకు చెందిన సురేందర్, స్కూల్ చైర్మన్ సంజీవరెడ్డి, ప్రిన్సిపల్ సుకన్య, కరస్పాండెంట్ వి. చంద్రకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.