హైదరాబాద్

జీవన ప్రమాణాలను మెరుగుపరుద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: ప్రజల అవసరాలను ముందుగానే గుర్తించి, వాటిని సకాలంలో తీరుస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు సమష్టిగా కృషి చేద్దామంటూ పిలుపునిచ్చారు జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి.జనార్ధన్‌రెడ్డి. వ్యక్తిగత మూల్యంకనం, మెరుగైన పౌరసేవల కల్పన, జిహెచ్‌ఎంసి పనితీరుపై ఆయన మంగళవారం ప్రధాన కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదావు కోటి జనాభా కల్గిన హైదరాబాద్ నగరంలో నిరంతరం అప్రమత్తతో పని చేయటంతో పాటు కింది స్థాయి అధికారులు, సిబ్బందితో పనిచేయించే విధంగా వ్యవహారించాలని పేర్కొన్నార. పౌరసేవలను అందించే స్థానిక సంస్థలలో పనిచేయటం ఒక సవాలుతో కూడిన పని అని, అధికార వికేంద్రీకరణ విధానాన్ని పాటించి ప్రతి స్థాయిలో జవాబుదారితనం కలుగచేసినపుడే ఉత్తమ సేవలు అందించటం సాధ్యమవుతుందన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల నిర్వహణ, నిరంతర పౌరసేవల కల్పన, వౌలిక సదుపాయాల కల్పన పెద్ద ఎత్తున చేపడుతున్న ఇంజనీరింగ్ పనులు, ప్రభుత్వం ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్, బిపిఎస్ పనులను తదితర ఎన్నో ప్రాధాన్యంశాల పనులను నిర్వహిస్తూ తీవ్ర వత్తిడిలో అధికారులున్నారని, ఈ ఒత్తిడిలో నిబంధనలు, చట్టాలను అతిక్రమించి ఏ విధమైన పనులు చేయవద్దని ఆయన సూచించారు. నగరంలో రోజురోజుకి వందలాది అక్రమ నిర్మాణాలు వస్తున్నాయని, ఎన్నో ఆరోపణలు స్వీకరిస్తున్నామని, అయితే టౌన్‌ప్లానింగ్ విభాగంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు కేవలం 59 మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఈ ఫిర్యాదులపై తక్షణమే స్పందించేందుకు ఉన్న సిబ్బందిని పూర్తి స్థాయిలో వినియోగించటంతో పాటు అదనపు సిబ్బందిని తాత్కాలిక పద్దతిలో నియామకం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని కమిషనర్ తెలిపారు.
సలహాలివ్వండి
జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడామైదానాలు, స్టేడియంల ఉపయోగాన్ని నగరవాసులకు మరింత మెరుగ్గా అందుబాటులోకి తెచ్చేందుకు అవరసమైన సూచనలు సలహాలు ఇచ్చిన ప్రజలు తమకు సహకరించాలని కమిషనర్ జనార్ధన్‌రెడ్డికోరారు. ఇందుకు గాను ప్రతి స్టేడియం, క్రీడామైదానంలో సలహాల బాక్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
దాదాపు కోటి మంది జనాభా ఉన్న నగరంలో పరిమిత సంఖ్లయో క్రీడామైదానాలున్నాయని, కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన స్టేడియంలను పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని మరోసారి సూచించారు.
జిహెచ్‌ఎంసి ప్రస్తుతం ఉన్న వాహనాల నిర్వహణ, మరమ్మతులకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నామని, ఈ విషయంలో మరింత పారదర్శకంగా ఉండేందుకు గాను ఆర్టీసి ద్వారా వాహనాల మరమ్మతులు చేపట్టే విషయంపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు.

రాష్ట్ర అవసరాల దృష్ట్యానే
చత్తీస్‌గడ్‌తో ఒప్పందాలు
ఖైరతాబాద్, డిసెంబర్ 1: తెలంగాణ రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకునే చత్తీస్‌గడ్‌తో విద్యుత్ ఒప్పందాలు ఇక్కడి ప్రభుత్వం చేసుకుందని తెలంగాణ ఇంజనీర్స్ జెఎసి పేర్కొంది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జెఎసి నేతలు మోహన్ రెడ్డి, శివాజీ, జానయ్య మాట్లాడుతూ విద్యుత్ ఒప్పందాల్లో అవకతవకలంటూ ఆరోపణలు రావడం విచారకరమని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఏపి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విద్యుత్ కష్టాలు తీసుకురాగా దానిని పూరించే క్రమంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారు. దక్షణాది రాష్ట్రాలు విద్యుత్ లోటులో ఉన్నాయని వాటిని అదిగమించాలంటే ప్రణాళిక ఎంతో అవసరమని అన్నారు.