హైదరాబాద్

ఎపుడైనా..ఎక్కడైనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగర ప్రజల సౌకర్యార్థం, పెరగుతోన్న రద్ధీ, జనాభాకు అవసరాల్ని గుర్తించి జిహెచ్‌ఎంసి చేపట్టనున్న ప్రతి పనిని తన సమయానుకూలంగా ఎపుడైనా, ఎక్కడైనా తనిఖీ చేస్తానని నగర మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. ఇప్పటికే జిహెచ్‌ఎంసి చేపడుతున్న పనుల్లో అధికారులు నాణ్యతను పాటించటం లేదన్న విషయాన్ని గుర్తించిన మేయర్ ఈ రకంగా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించనున్నట్లు ప్రకటించటంపై ఇంజనీరింగ్ విభాగంలో అక్రమార్కులైన కొందరు అధికారులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ మేరకు ఆయన సికిందరాబాద్ బేగంపేట ప్రాంతంలో కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు పనులను మేయర్ మంగళవారం అర్థరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోడ్డు నిర్మాణానికి వినియోగించే మిశ్రమాన్ని తగిన మోతాదులో కలుపుతున్నారా? లేదా? అన్న విషయంపై ఆయన ఆరా తీశారు. అంతేగాక, ఇక్కడ వేస్తున్న బిటి రోడ్డును ఎంత లోతులో నుంచి వేస్తున్నారన్న విషయాన్ని గుర్తించేందుకు స్వయంగా తవ్వి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ ప్రస్తుతం గ్రేటర్‌లో సుమారు 1800 కిలోమీటర్ల పొడువున రోడ్లను రీ కార్పెటింగ్ చేస్తున్నట్లు వివరించారు. గ్రేటర్ అధికారులు, ఇంజనీర్లు కేవలం రోడ్ల నిర్మాణ పనులనే గాక, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు సైతం పూర్తయిన పనులను శాస్ర్తియంగా తనిఖీ చేసి ఏమైనా లోపాలుంటే వాటితో కూడిన నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. మున్ముందు జిహెచ్‌ఎంసి చేపట్టే అన్ని పనులకు ఇదే రకంగా ముందస్తు ఎలాంటి సమాచారం లేకుండా, ఆకస్మికంగా తనిఖీలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు పనులెలా చేపట్టారో గానీ, ఇపుడు నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న కృషి ఫలించాలంటే ప్రతి పనిని చిత్తశుద్ధితో నాణ్యతతో నిర్ణీత గడువులోపు పూర్తి చేసేలా గ్రేటర్ అధికారులు విధులు నిర్వర్తించాలని ఆయన కోరారు. ఒకవైపు నగరంలో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తూనే మరోవైపు ప్రస్తుతం నగర అవసరాలకు అనుకూలంగా కావల్సిన అభివృద్ధి పనులు చేపట్టేందుకు వంద రోజుల ప్రణాళికలో అనేక పనులకు ప్రాధాన్యతనిచ్చినట్లు మేయర్ వివరించారు. ముఖ్యంగా రోడ్ల నిర్మాణంలో తగిన నాణ్యతను పాటిస్తేనే అవి ఆశించినన్ని రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు పనులు చేపట్టాలని సూచించారు.