హైదరాబాద్

ఉద్యోగాల జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగర ప్రజలకు కేవలం అత్యవసర, అతి ముఖ్యమైన పౌరసేవలే గాక, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు సిద్ధమైంది జిహెచ్‌ఎం. ఇప్పటికే డ్రైవింగ్ లైసెన్సులు కలిగిన యువతకు డ్రైవర్ కమ్ ఓనర్ స్కీం కింద కార్లను ఇప్పించిన మహానగర పాలక సంస్థ ఇపుడు మెరుగైన సేవలందించేందుకు రూపకల్పన చేసిన వంద రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా రెండు వేల మందికి ఉపాధి కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 21 నుంచి జాబుల జాతర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సికిందరాబాద్ హరిహర కళాభవన్‌లో రెండు రోజుల పాటు భారీ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ మేళాలో సుమారు 30 పేరుగాంచిన సంస్థలు తమ అవసరాలకు తగిన ఉద్యోగులను ఎంపిక చేసుకోనున్నట్లు కమిషనర్ తెలిపారు. వంద రోజుల యాక్షన్ ప్లాన్ కింద రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలలని భావించినా, ఈ సంఖ్యను మరింత పెంచే అవకాశముందని ఆయన వెల్లడించారు. ఈ నెల 21 నుంచి మే 18వరకు నగరంలోని అన్ని సర్కిళ్లలో నిరుద్యోగ యువతకు ప్రత్యేకంగా మేళాలు నిర్వహించనున్నట్లు, ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. 21న హరిహరకళాభవన్ జరిగే జాబ్ మేళాను మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభిస్తారని తెలిపారు. ఈ నెల 21,22 తేదీల్లో నిర్వహించనున్న జాబ్ మేళాకు నార్త్‌జోన్‌లోని 15,16,17,18 సర్కిళ్లకు చెందిన నిరుద్యోగ యువత హాజరుకావాలని సూచించారు. ఈ జాబ్ మేళాలో పదో తరగతి పాస్, లేదా ఫెయిల్ అయిన అభ్యర్థుల నుంచి ఐటిఐ, ఇంటర్, డిగ్రీ, ఎంబిఏ, డిప్లోమా, ఇంజనీరింగ్ అర్హతలు కలిగిన 18 ఏళ్లనుంచి 35 ఏళ్లలోపు వయస్సు గల అభ్యర్థులు హాజరుకావాలని ఆయన సూచించారు. హరిహరకళాభవన్‌లో నిర్వహించే రెండురోజుల జాబ్ మేళాలో మొదటి రోజైన 21న రిజిస్ట్రేషన్, అవగాహన, ఆర్గనైజర్స్ పరిచయ కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. రెండో రోజైన 22వ తేదీన రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు.ఎంపికైన అభ్యర్థులకు అక్కడికక్కడే ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. దీంతో పాటు ఏప్రిల్ మాసంలో 12,13 తేదీలలో ఈస్ట్‌జోన్ యువతకు, 22, 23 తేదీల్లో వెస్ట్‌జోన్‌లో, మే 6, 7 తేదీల్లో సెంట్రల్ జోన్‌లో, మే 17,18 తేదీల్ల సౌత్ జోన్ నిరుద్యోగ యువకులకు జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. నిరుద్యోగ యువత బయోడేటా వివరాలతో పాటు సర్ట్ఫికెట్ల జిరాక్స్ అయిదు సెట్లతో ఈ జాబ్‌మేళాకు హాజరుకావాలని కమిషనర్ సూచించారు.