హైదరాబాద్

చెత్త నుంచి విద్యుత్ తయారీపై పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశంలోని ప్రతి ప్రధాన నగరంలో భవన నిర్మాణ వ్యర్థాల తొలగింపు సమస్యగా మారిన నేపథ్యంలో ఈ వ్యర్థాలను భవన నిర్మాణ రంగానికి ఆదాయ మార్గంగా మల్చుకోవటంలో దిల్లీ నగరం ముందంజలో ఉందని చెప్పవచ్చు.
రాష్ట్ర మున్సిపల్, శాఖ మంత్రి కెటిఆర్‌తో ఒక రోజు దిల్లీ పర్యటనకు వెళ్లిన మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి శుక్రవారం దిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ముఖ్యంగా మేయర్, కమిషనర్ భవన నిర్మాణ వ్యర్థాలతో విద్యుత్‌ను తయారు చేస్తున్న ప్లాంటును సందర్శించి, ప్లాంటు నిర్వహణ అంశంపై తెల్సుకునేందుకు అక్కడి అధికారులతో సమావేశమయ్యారు. సంబంధిత అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
తమ ప్లాంట్‌లో ప్రతిరోజు 500 మెట్రికల్ టన్నుల భవన నిర్మాణ వ్యర్థాల నుంచి నిర్మాణ రంగానికి అవసరమైన పలు సామాగ్రిని తయారు చేస్తున్నట్లు వివరించారు. వీటి నుంచి ఇటుకలు, ఇసుక, సిమెంట్ బ్లాక్‌లు వంటివి తయారు చేసి, మిగిలిన ఇసుకను రెడిమిక్స్‌లో ఉపయోగిస్తామని వివరించారు. రబ్బుల్ మాస్టర్ అనే యంత్రాన్ని ఈ ప్లాంట్‌లో ప్రధానంగా ఉనియోగిస్తామని తెలిపారు. అనంతరం తూర్పు దిల్లీలోని ఘజియాపూర్‌లో ఏర్పాటు చేసిన చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్లాంటు పనితీరును మేయర్ రామ్మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్లాంటు నిర్వాహకులు వివరిస్తూ రోజుకి 1300 టన్నుల వ్యర్థ పదార్థాలతో 12 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా దిల్లీలో చెత్త డంపింగ్ సమస్య పాక్షికంగా తొలుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పాదన విధానాన్ని, దీనికి వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మేయర్, కమిషనర్లు పరిశీలించారు. వీరితో పిటు జిహెచ్‌ఎంసి చీఫ్ ఇంజనీర్ ప్రాజెక్టు విభాగం ఇంతియాజ్ అహ్మద్ కూడా ఉన్నారు.
కేంద్ర మంత్రితో భేటీ
ఒక రోజు దిల్లీ పర్యటనకు వెళ్లిన మున్సిపల్ మంత్రి కెటిఆర్, మేయర్ రామ్మోహన్, కమిషనర్లతో కూడిన బృందం శుక్రవారం కేంద్ర పురపాలక శాఖ మంత్రి వెంకయ్యనాయుడును కలిసింది. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దటంలో భాగంగా చేపట్టిన పలు భారీ ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులను మంజూరు చేయాలని కోరారు. ముఖ్యంగా స్వచ్ఛ భారత్‌లో భాగంగా హైదరాబాద్ నగరానికి మరిన్ని నిధులు కేటాయించాల్సిందిగా ఆయన కోరారు. అనంతరం కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్, ఇతర మంత్రులను మంత్రి కెటిఆర్ బృందం కలిసింది.