హైదరాబాద్

ప్రజారవాణాకు అత్యంత ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: నాలుగువందేళ్ల చరిత్ర కల్గిన మహానగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకు రకరకాల మార్గాలను అనే్వషిస్తూనే, మెరుగైన ప్రజారవాణా వ్యవస్థను రూపకల్పన చేసేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. దీనికి తోడు త్వరలోనే ప్రత్యేక పార్కింగ్ పాలసీని కూడా ప్రకటించనున్నట్లు ఆయన వివరించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మంది ఐఏఎస్ అధికారులు, ఆర్మీ అధికారులతో కూడిన బృందంతో ఆయన గురువారం సమావేశమయ్యారు. నగరాభివృద్ధి ప్రణాళిక, విధానపరమైన నిర్ణయాలు, కొత్త పథకాలు, తదితర అంశాలపై అధికారులతో మేయర్ విస్త్రృతంగకా చర్చించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రధాన నగరాల కన్నా హైదరాబాద్ నగరంలో జనాభా సాంద్రత అధికంగా ఉందన్నారు. ఈ క్రమంలో తీవ్ర సమస్య మారిన ట్రిఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ఇప్పటికే వ్యూహాత్మక రహదార్ల అభివృద్ధి ప్రణాళిక(ఎస్‌ఆర్‌డిపి)ని చేపట్టిన విషయాన్ని వివరించారు. ఇందులో భాగంగా మొదటి దశలో 54 జంక్షన్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు బృందానికి వివరంచారు. ఔటర్‌రింగురోడ్డుకు 34 రేడియల్ రోడ్ల నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నట్లు తెలిపారు. నగరంలో రోడ్ల మరమ్మతులనేవి ప్రధాన సవాలుగా మారాయని, ఇందుకు గాను ప్రత్యేకంగా రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, 300 కిలోమీటర్ల వైట్‌టాపింగ్, ఇతర రోడ్లును నిర్మించనున్నట్లు తెలిపారు. నగరంలో సైకిలింగ్‌ను కూడా ప్రోత్సహించేందుకు దాదాపు 20 ప్రాంతాల్లో ప్రత్యేకంగా చక్కటి సైక్లింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గ్రేటర్ పరిధిలోని 195 చరువులను కాలుష్య బారిన పడకుండా రక్షించేందుకు దశల వారీగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకు గాను మురుగునీరు చెరువుల్లో కలవకుండా సీవరేజీ ప్లాంట్లను ఏర్పాటు చేసి, ప్రతి చెరువుకు వాకింగ్ ట్రాక్ నిర్మాణం, పార్కులు, సైక్లింగ్ ట్రాక్‌లతో పాటు ఇతర సౌకల్యాలను కల్పించనున్నట్లు తెలిపారు. నగరంలో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయనున్నామని, ఇందుకు తగిన ప్రణాళికలు సిద్దమవుతున్నట్లు వివరించారు. నగరంలో పచ్చటి వాతావరణాన్ని, మరింత ఆహ్లాదకరాన్ని పెంపొందించేందుకు గాను ఐదేళ్లలో పది కోట్ల మొక్కలను నాటాలన్న సంకల్పంతో ఉన్నట్లు మేయర్ వివరించారు. ఇదిలా ఉండగా, ప్రపంచంలోని ఇతర మెట్రోపాలిటన్ నగరాల మేయర్లకు విస్త్రృత అధికారులున్నప్పటికీ, హైదరాబాద్ లాంటి నగర్ల మేయర్లకు పరిమితమైన అధికారాలున్నాయని వివరించారు. జిహెచ్‌ఎంసి చేపట్టిన అభివృద్ధి పనులు, అన్నపూర్ణ భోజన పథకాల గురించి బృందానికి మేయర్ వివరించారు.